పుట:RangastalaSastramu.djvu/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లతో సంప్రదించి చేసిన నిర్ణయాలను ఆధారము చేసుకొని ఈ పాఠ్యగ్రంధాలలో ఆధునిక ప్రామాణికభాష కొక రూపమిచ్చి ఉపయోగించినాము.

ఇక పారిబాషికపదాల విషయం. తెలుగులో ఈ నాటివరకూ ప్రచురిత మైన శాస్త్రగ్రంధాలలో, అవిభక్త మద్రాసు ప్రభుత్వము. భారత ప్రభుత్వము, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ మమిషన్ వారు తయారుచేసిన పారిభాషికపదపట్టికలలో, జాతీయీకరించిన పాఠ్యగ్రంధాలలో, తదితర ప్రామాణిక రచనలలో లభ్యమైన సాంకేతిక పదాలను అన్నింటినీ సాధ్యమయినంత వరకు సంపాదించి అకాడమి క్రోడీకరించింది. గ్రంధకర్తలు, నిపుణులు కొన్ని పట్టికలను తయారుచేసినారు. పది పన్నెండు ముఖ్యనియమాలను అనుసరించి శాస్త్రీయ పద్దతిలో భిన్న పారిభాషికపదాలనుంచి ప్ర్రామాణికమైన పదాలను నిర్ధరించినాము. మూడు విశ్వకళాపరిషత్తులలోని శాస్త్రనిపుణులు, అకాడమిలోని బాషానిపుణులు ప్రత్యేకసమావేశాలలో కలిసి చర్చించి అంగీకతించిన పారిబాషిక పదాలను మాత్రమే గ్రంధాలలో వాడినాము. తెలుగు మాటలను మొదటిసారి వాడినప్పుడు వాటి అంతర్జాతీయ పర్యాయపదాలను కుండలీకరణాలలో పేర్కొన్నాము. ప్రర్కృత గ్రంధరచనావిధానాన్ని, అందులోని విష్టతను 'ప్రవేశిక ' లో రచయితలు, సంపాదకులు వివరించినారు.

అకాడమి స్థాప్న జరిగి, ప్రధమసంవత్సర పాఠ్యగ్రంధ రచనా కార్యక్రమంలో అడుగుపెట్టేసరికి కళాశాలలు తెరవడానికి ఆరునెలలు వ్యవధి మాత్రమే ఉంది. ఈ స్వల్పకాలంలో, రాష్ట్రాన్ని ఆవరించిన సంక్షోభ సమయంలో పైకార్యకలాపమంతా నెరవేర్చవలసిరావడం కష్టమే అయింది. అయినా భారత ప్రభుత్వంవారు సకాలంలో ఇచ్చిన ఆర్ధికసహాయంవల్ల, రాష్ట్రప్రభుత్వము, విశ్వ కళాపరిషత్తులు, అకాడమి పాలకవర్గము, అమాడమి సభ్యులు, రచయితలు, సంపాదకులు, చిత్రకారులు, బ్లాక్ మేకర్లు, ముద్రాపకులు మాకిచ్చిన తోడ్పాటు వల్ల ఈ కార్యక్రమము జయప్రధంగా నెరవేరింది. వారిందరికి మాకృతజ్ఞత.

ప్రకృత గ్రంధరచనలో మాకు తోడ్పడిన నిపుణులు శ్రీ అబ్బూరి రామకృష్ణరావు, శ్రీ ఎ.ఆర్. కృష్ణ గార్లకు, చిత్రకారుదు శ్రీ ల్పి.ఆర్. రాజుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.

శాస్త్రగ్రంధ ప్రచురణలో మాకిది ప్రధమ ప్రయత్న మైనందువల్ల, దేశకాల పరిస్థితులవల్ల ఏవైనా కొన్ని లోపాలు ఈ పాఠ్యగ్రంధంలో కూడా సహజంగానే దొర్లి ఉండవచ్చు. పునర్ముద్రణలో ఈ గ్రంధము మరింత సర్వాంగసుందరంగా వెలువడుతుందని ఆసిస్తున్నాము.