Jump to content

పుట:RangastalaSastramu.djvu/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కృత రూపకరచనావిధానము

ఇంకోవిధానము: తెరలోనుంచిగాని, రంగస్థలంమీద ఉన్న పాత్ర గాని మధ్యాహ్నమయినదనో, సాయంకాల మయినదనో హెచ్చరించగా ఆయా కాలకృత్యాలను నెరవేర్చే నిమిత్తము పాత్రలు నిష్క్రమించడం.

ఉదా|| శాకుంతల తృతీయాంకం చివర తెరమరుగునుంచి "ఓ రాజా! సాయంకాలమునందు జెయదగు.. ... .. సంచారంబు గావించెడున్" అనిహెచ్చరించగా రాజు "ఇదే వచ్చుచున్నాను" అని నిష్క్రమించినాడు.

ఇక రంగస్థలంమీదిపాత్రే కాలసూచనచేసి నిష్క్రమించడం. ఉదా|| స్వప్నవాసవదత్త నాటకంలో యౌగంధరాయణుడు "అమ్మా! రందు, ఇటు ఇటు, సాయంకాలమైనది. పులుగుల్ చేరె గులాయ్ముల్.. ... ప్రొద్ధల్లల్లనన్" 1, అని చెప్పి తక్కినపాత్రలతోపాటు తానూ నిష్క్రమిస్తాడు.

అర్ధోపక్షేపకాలు

జరిగిపోయిన, జరగబోయే నీరససన్నివేశవిషయాలను, దేశ కాలాలను, అప్రదర్శనీయ విషయాల్ను ప్రేక్షకులకు తెలియజేయడానికి ఉద్దేశించిన రంగాలను అర్ధోపక్షెపకాలంటారు. రెండురోజులు మొదలు సంవత్సరపర్యంతము జరిగిన కషను మాత్రమే వీటిలో సూచించేవారు. ఒకవేళ కధ సంవత్సరాకాలం కంటె ఎక్కువకాలము జరిగినట్లయితే అది సంవత్సరంలోపల జరిగినట్లే వర్ణించవలె. వీటిలో ప్రధానపాత్రలను ప్రవేశపెట్టరాదు.

ఈ అర్ధోపక్షేపకాలు ఐదువిధాలు-1.విష్కంభము, 2.ప్రవేసకము, 3.చూళిక, 4.అంశముఖము, 5.అంకావతారము.

1.విష్కంభము

విష్కంభము రెండురకాలు-1.శుద్ధవిష్కంభము, 2.మిశ్రవిష్కంభము.

(1) శుద్ధవిష్కంభము: ఒకడుగాని, ఇద్దరుగాని మధ్యమపాత్రలు నదిపిన రంగము శుద్ధవిష్కంభము. దీనిని రూపక ప్ర్రాతంభంలోగాని, అంకప్రారంభంలోగాని ప్రవేశపెట్టవచ్చు. ఏకపాత్రవిష్కంభానికి, రూపకప్ర్రారంభ విష్కంభానికి రత్నావళినాటికలోని ప్రారంభ విష్కంభము చక్కని ఉదాహరణ.


1..--చిలకమర్తివారి అనువాదము.