పుట:RangastalaSastramu.djvu/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అర్ధోపక్షేపకాలు

యౌగంధరాయణుడొక్కడే ఈ శుద్ధవిష్కంభాన్ని నాటికప్రారంభంలో నడిపినాడు. ఈ విష్కంభంవల్ల రత్నావళి పూర్వవృత్తాంతము ప్రేక్షకులకు తెలిసినది.

(2) మిశ్రవిష్కజ్ంభము: మధ్యమ, వీచపాత్రలు నడిపేది మిత్ర విష్కంభము. ఉదా|| స్వప్నవాసవదత్తలో మధ్యమపాత్ర అయిన విదూషకుడు. నీచపాత్రలగు చేటికలు నదుపు విష్కంభము; శాకుంతలంలో నీచపాత్రలగు అనసూయా ప్రియంవదలు,మధ్యమపాత్ర అయిన దుర్వాసుడు నడుపు విష్కంభము: మాళవికాగ్ని మిత్రలో ప్ర్రారంభ విష్కంభము మిశ్రవిష్కంభములు.

2.ప్రవేశము

ఒకటిగాని, రెందుగాని నీచపాత్రలుగలది ప్రవేశకము. ఇది రెండు అంకాల మధ్య రాఅలెనేగాని రూపోకప్రారంభంలో రాకూడదు. ఏకపాత్ర ప్రవేశకానికి స్వప్నవాసవదత్తలో ద్వితీయాంక ప్రారంభంలో ఛేటీ ప్రయుక్త ప్రవేశాము. శాకుంతలంలో పంచమ షష్టాంకాలమధ్యగల పల్లెవాని రంగము ఉదాహరణలు.

3.చూళిక

పాత్రలు రంగస్థలంమీదకు ప్రత్యక్షంగా రాకుండా తెరలోపలనుంచి సమాచారము సూచింఛడం చూళిక. నీచపాత్ర చూళికకు ఉదా|| రత్నావళికి ప్రధమాంకంచివర వైతాళికులు ప్రయోగించిన ధూళిక, ఉత్తమపాత్ర ప్రయోగానికి వేణీసంహారం సష్ఠాంకంలో బీముడు "ఓహో! శమంతకపంచక సంచారులారా!." అంటూ ప్రయోగించిన చూళిక ఉదాహరణము. ఇది అంకంమధ్యలొ ప్రయుక్తమవుతుంది. శాకుంతలం ప్రధమాంకంలో తెరలోనుంచి "ఓహో! ఇది ఆశ్రమ మృగము, చంపదగినదికాదు" అని వైభానసనముని ప్రయోగించిన చూళిక మధ్యమ పాత్ర చూళిక. ఇదీ అంకం మధ్యలోనిదే! ఇంక అంకప్రారంభంలో చూళికకు పాండవ విజయం పంచమాంక ప్రారంభంలో "దీపంబుల్ వెలిగించిరెల్లెడల..." అనే పద్యము ఉదాహరణ.

రంగస్థలంమీది పాత్ర తెరళోని పాత్రతొ మాటాడడం ఖండచూళిక.

ఉదా|| "వెంకన్న కాపురం"1 నాటకంలొ రంగస్థలంమీది వెంకన్న తెరలోపలి భర్యతొ సంభాషించడం.


1.---ముదిగొండ లింగమూర్తి రచన.