పుట:RangastalaSastramu.djvu/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంకము

ఓకవ్య్హక్తియొక్క-అంటే నాయకుని జీవితము ఆసాంతము రూపకంగా మార్చడం సాధ్యపడదు. అతనిజీవితంలోని ఒకానొక ఆసక్తిదాయకమైన ప్రముఖమైన ఘట్టాన్ని రూపకంలో చిత్రించడం సాధ్యపడుతుంది. ఆ ఘట్టాన్ని గురించిన సమాచారము ఎంతోఉంటుంది. అందులో అనేక సన్నివేశాలు ఉంటాయి. ఈ సన్నివేశాలలొ కొన్ని సరసమైనవి. కొన్ని నీరసమయినవి ఉంటాయి. నీరసమయిన సన్నివేశాలను దృశ్యమానముచేస్తే విరసంగా విసుగుగా ఉంటుంది. అందుచేత నీరససన్నివేశాలను సూచిస్తే చాలునని లాక్షణికులు అభిప్రాయపడినారు. కొన్ని సన్నివేశాలు అసబ్యంగా, కొన్ని జుగుప్సాకరంగా, మరికొన్ని ప్రత్యక్షంగా చూపడానికి అసాధ్యమైనవిగా, కష్టమైనవిగా ఉంటాయి. ఇటువంటివాటిని ప్రత్యక్షంగా దృశ్యమానము చేయరాదని సంస్కృతలాక్షణికులు నిషేధించినారని తెలిసికొన్నాము.

అంకము

ప్రత్యక్షంగా దృశ్యమానముచేసే సన్నివేశాన్ని 'అంకము ' అన్నారు. ఈ అంకాన్ని రంగాలుగా విభజినచేయడం లాక్షణికులు చెప్పకపోయినా కొన్ని రూపకాలలో అంకము రెండు, మూడు రంగాలుగా విభజితమవుతూనే ఉంటుందని గుర్తించిఉన్నాము. రూపకంలోవలెనే ప్రతి అంకానికి ఒక్కొక్కరు నయకత్వము వహిస్తూంటారు. ప్రతిఅంకానికి వేరువేరు నాయకులుండవలెననే నియమంలేదు. కొన్ని అంకాలకు ఒకే నాయకుడు ఉండవచ్చు. శాకుంతలంలో 7 అంకాలలో 6 అంకాలకు ధుష్యంతుడే నాయకుడు. 4 వ అంకానికి కణ్వుడు నాయకుడు. వేణీసంహార నాటకంలో ఒక్కొక్క అంకానికి ఒక్కొక్క నాయకుడున్నాడు.

అంకానికి కూడ రూపక ప్రధానలక్షణాలను అనుసంధించవలె. ఒక రోజులో జరిగిన కషనుమత్రమే నిబంధించవలె. ప్రాచీనసం స్కృతనాటకరంగంలో ముందు తెర లేకపోవడంవల్ల అంకాంతమందు ఈ పాత్రలన్నీ నిష్క్రమించవలెనని సంస్కృతలాక్షణికులు అదేశించినారు. పాత్రలన్నింటినీ అంకాంతాన ఒకేసరి నిష్క్రమింపచేయడానికి సంస్కృత రూపోకర్తలు అనేక విధానాలు అవలంభించినారు. ఏదోఒక కార్యార్ధమై బయలుదేరి వెళ్ళినట్టు చిత్రించడం. ఉదా|| శాకుంతలం ద్వితీయాంకంచివర దుష్యంతుడు-"వయస్యా ! నీరు నాకార్యమునం బ్రవర్తిల్లుము. నేను తపోవన రక్షణార్ధ మక్కడికి వెళ్ళేదను."1


1.--వీరేశాలింగం పంతులుగారి అనువాదము