పుట:RangastalaSastramu.djvu/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవర్తకుల వాదము. నిశితమైన పరిశీలనముచేస్తే నిత్యజీవితంలొని సంభాషణలు కృతకమైనవని వెల్లడి అవుతుంది. తర్కబద్ధంగా వ్రాసిన నాటకాలలో కూడా ఇట్టి హేతుబద్ధంకాని సంభాషణలే ప్రయుక్తమయినవి. అందువల్ల కూడా ఇట్టి హేతుబద్ధంకాని సంబాషణలే ప్రయుక్తమయినవి. అందువల్ల తర్కబద్ధమైన సాంప్రదాయికనిబద్ధరూపకాలు అవాస్తవికమైనవనీ, అనిబద్ధరూపకాలే వాస్తవికతకు వ్యాఖ్యానాలని ఈ రచయితలు నమ్మినారు. ఈవ్యక్తి గతమైన మానవమనోధర్మాన్ని తమ నాటకాలఓ వ్యక్తీకరించడం కోసము ఈ నాటకకర్తలు మానవుల మనస్సులలో చైతన్య, అర్ధ చైతన్యావ్యవస్థలలో జరిగే వివిధ సంఘటనలను చిత్రీకరించే ప్రయత్నము చేసినారు.

ఈవిధమైన అనిబద్ధభావ ప్రకటనము నాటకాలలో రెండవ ప్రపంచయుద్ధము తరవాతనే ప్రయుక్తము ఛేయబడినా, దీని బీజాలు 1919 లొ "మానిఫెస్టో"లోనే కనిపిస్తాయి.

ఈ అనిబద్ధరూపకోద్యమానికి పునాదులు వేసినవాడు లెగ్వీ పిరాండేల్లో. ఈయన నాటకాలన్నింటిలో ప్రతిపాదితమయిన భావమొక్కటే- 'సత్యము ' అనేదానికి వేరువేఉ వ్యక్తులు వేరువేరు అర్ధాలను ఇస్తారని, ఇందులో ఏది నిజమైన సత్యమో చెప్పలేమని, ఈభావము 'Six Characters in Search of an Author' అనే నాటకంలో మనకు విస్పష్టంగా గోచరిస్తుంది.

ఈపద్ధతిలో రూపకాలు వ్రాసిన ప్రముఖ రచయితలు జీన్ పాల్ సత్రే, ఆల్బర్ట్ కామూ, శామ్యూల్ బెక్కెట్, అయె నెస్కాలు.

ఈనాటి నాటకరంగము త్వరితగతిని మారుతూ కొత్తకొత్త ఉద్యమాలకు, సిద్ధాంతాలకు లోనై కొత్త రూపాలను గ్రహిస్తున్నది. కాని ఈ విభిన్నరూపాలన్నీ కూడా నాటకకర్తలు జీవితమంటే ఏమిటి, మానవుని జీవితానికి అర్ధమేమిటి- అనే ప్రశ్నలకు వారువారు చెప్పుకొనే సమాధానాలని గ్రహిస్తే ఈ నాటకోద్యమాలన్నీ మానవుని జీవితరంగంలో వచ్చే విభిన్న సంఘటనలుగా కన్పట్టక మానవు.