పుట:RangastalaSastramu.djvu/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



కావ్యము రెండువిధాలు--1.శృవ్యకావ్యము అంటే స్వయంగా చదువుకోవడానికి, ఇతరులు చదువుతూ ఉండగా వినడానికి ఉద్దేశించిన రచన. ఉదా|| పురాణాలు, ప్రబంధాలు, నవలలు, కధలుమొదలైనవి. 2.దృశ్యకావ్యము: అంటే చదువుకోవడానికి, వినడానికి మాత్రమే కాక దృశ్ల్యమానము చేయడానికి, అంటే ప్రదర్శించడానికి ఉద్దేశించిన రచన. ప్రత్యక్షము చేబబడేది కనుక రూపకము. రూపాలొపము కలది కాబట్టి రూపకము. అంటే ప్రత్యక్షంగా చూడదగినది. నటుడు రామాదిపాత్రల అవస్థలను తనమీద ఆరోపించుకొంటాడు కాబట్టి ఇద్ రూపకమైనది. నటుడు ప్రదర్శన సమయంలో తనను తాను ధరించిన పాత్రగా భావించుకొంటున్నాడు1.

నటీనటులు, సంకేతజ్ఞలు పూరించవలసిన అంశాలు అనేకము ఉండడంవల్ల రూపకము ప్రదర్శించినప్పుడే సంపూర్ణతను చేకూర్చుకొంటుంది; సార్షక మవుతుంచి. "ప్రదర్శనదృష్టితో చూస్టే కేవలము రూపకరచన అస్తిపంజరము వంటిదనటం సాహసము కానేరదేమో! దానికి రంగస్థలము దేహము, నటులు రక్తమాంసాలు. సూత్రధారుడు ప్రాణము. ప్రేక్షకులు శోభ."2


1.ప్రఖ్యాత ప్రెంచినటుడు కొకెచిన్ (Coquelin)కూడా ఇట్లాంటి అభిప్రాయాన్నే చెప్పినాడు; "The actor creates his model in his imagination, and then, just as does the painter, he takes every feature of it and transforms it, not to canvas, but on to himself" ("నటుడు తన భావనాప్రపంచంలో పాత్రను సృష్టించుకొంటాడు. తరవాత చిత్రకారుడు చిత్రాన్ని కాన్వాసుమీద ఆరోపించినట్లే నటుడు తాను సృష్టించుకొన్న పాత్ర ఆకృతినంతా తనమీద ఆరోపించుకొంటాడు.")

2.--డాక్టర్ పోనంగి శ్రీరామ అప్పారావు, "నాట్యశాస్త్రము" పుట.532.