Jump to content

పుట:RangastalaSastramu.djvu/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునిక నాటకరంగము

మైన వానిని (strange)గా తయారుచేయవలె; దానిని సాధించడానికి ప్రేక్షకులలో ఉద్వేగాలకు బదులు తాదాత్మ్య విచ్చిత్తి (alienation) ఉద్బుద్ధము చేయవలెననే సిద్ద్గాంతాన్ని ఆయన ప్రవచించినాడు. నాటకము ప్రదర్శింఛే వాస్తవికమనే భ్రమ (illusion of reality) ను చెదరగొట్టి దాని స్థానే పరాశ్రయ బావంతో ప్రతి సంఘటనను ప్రేక్షకుడు విశ్లేషించి చూడవలెనని ఈ సిద్ధాంతము నిర్దేశిస్తుంది.

ఈ ఫలితాలను సాధించడానికిగాని బ్రెహ్ట్ తన నాటకాలలో విచిత్రమైన సన్నివేశాలను ప్రవేశపెట్టినాడు. ఒక రంగము వాస్తవిక చిత్రలు, ఒకటి ప్రతీక చిత్రలు, మరొకటి కేవలము కధాకధనము మాత్రమే కల రంగము; ఒకే రంగంలో పాటలు, నృత్యము, మరొకచోట పాత్రలకు బదులు కొన్ని స్లైడ్లు లేదా సినిమా ఫిల్ములు చూపడం- ఇట్లా ఒకదానివెంట మరొక దృశ్యము అతిత్వరగా కదులుతూ వాస్తవంనుంచి దూరంగా ప్రేక్షకుని నడిపించుకొనిపోయి, ఈ సంఘటనలచే ఒక నూతన ప్రపంచంగా నిర్మించి, అందులో ప్రేక్షకునీ నిద్రాణమై ఉన్న అతని శక్తులనూ మేల్కొల్పడం ఈ రచయిత ధ్యేయము.

అట్లాగే రంగాలంకరణలోను, దీపాలంకరణలోను కూడా ఇది జీవిత మని భ్రమపడడానికి వీలులేనట్లుగా మార్చివేసినాదు బ్రెహ్ట్, దీనికి నిదర్శనంగా Mother Courage, From the Private Life of a Master Race అనే ఆయన నాటకాలను పేర్కొనవచ్చు.

అనిబద్ధ రూపకము: (Absurd Drama)

మానవుని జీవితానికి ఏదో అర్ధము ఉన్నదని తరతరాల నమ్మిక, జీవితానికి మనము నిరూపించగల అరము అంటూ ఏమీలేదని అనిబద్దనాటకోద్యమము చెప్పదలుచుకొన్న సిద్ధాంతము. ప్రపంచము తటస్థమైనదని, అందులో జరిగే సంఘటనలకు అర్ధములేదని,, మానవుడే తనకు కావలసిన అర్ధాన్ని వాటికి ఆపాదిస్తున్నాడని ఈ నాటక రచయితల భావము.

నిష్పాక్షికమైన సత్యము అంటూ లేదని, ప్రతిమానవుడు తన జీవితాన్ని తాను గడపడానికి కావలసిన విలువలను తాను స్వీకరించవలెనని, అంతమాత్రాన తన విలువలే అతిముఖ్యములని కాక, తాను నమ్మినవిలువలు కూడా అనిబద్ధాలే, అవాస్తవికాలే అనే నిజాన్ని గ్రహించవలనని ఈ సిద్ధాంత