పుట:RangastalaSastramu.djvu/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిశ్ర రూపకాలు

రాను రాను ఆపెరా రూపాలలో అభివృద్ధి చెందింది. 1.హాస్య ఆపెరా (Comic opera), 2.బేలద్ ఆపెరా (Ballad opera), 3.రొమాంటిక్ ఆపెరా (Romantic opera), 4.స్లావినిక్ ఆపెరా (Slavonic opera) 5.లైట్ ఆపెరా (Light opera), మోడర్న్ ఆపెరా (Modern opera).

ఈనాడు సుప్రసిద్ధనాటకాలను ఆపెరాలుగా రూపొందిచడం పరిపాటి అయినది.

త్యాగరాజు వ్రాసిన నౌకాచరితము, ప్రహ్లాద చరిత్రము తెలుగులోని ఆపెరాలకు ఉదారహరణలు.

మిశ్రరూపకాలు (Mixed Types)

నాటకము మానవుని జీవితమంతా చిత్రించదు. జీవితంలో ఆసక్తిదాయకమైన ఏ ఒకటి రెండు ఘట్టాలనో చిత్రిస్తుంది. ఆఘట్టము సంపూర్ణ విషాద ఘట్టముకావచ్చు లేదా రెంటి సమ్మిశ్రణము కావచ్చు.

సంపూర్ణవిషాద ఘట్టాలను చిత్రించే రూపకాలను శుద్ద విషాద రూపకాలు (Pure Tragedies) అంటారు. అట్లాగే సంపూర్ణ-ఆహ్లాదఘట్టాన్ని చిత్రించే రూపకాలను శుద్ధ ఆహ్లాదరూపకాలు (Pure Comedies) అంటారు. విషాద ఆహ్లాదసమ్మిశ్రరూపకాలను మిశ్రరూపకాలు (Mixed Types) అంటారు.

1.ఆహ్లాదము ఏమాత్రము ఉండని రూపకాలు శుద్ద విషాద రూపకాలు, చివరకు ప్రధాన పాత్రల మృతితో రూపమంతమవుతుంది. ఏదిపస్ రాజు (Oedipus Rex), ఊరుభంగము (నం), రామరాజు (తె) ఇందుకు ఉదాహరణలు.

2.నాటకంలొ అక్కడక్కడా ఆహ్లాదచ్చాయలు ఉన్నా అవి విషాదానికి దారి తీసే నాటకాలు - ఉదాహరణకు ఉత్తరరామ చరిత్ర (సం). హరిశ్చంద్ర (తె), చిత్రనళీయం (తె) కింగ్ లీయర్ (King Lear).

3.ఉపశమనం (relief) కోసమో, విపర్యయం (contrast) కోసమో ఆహ్లాదము కొంతఉన్నా విషాదాంతమయ్యే నాటకాలు - ఉదాహరణకు మెక్ బెత్ (Macbeth)

4.విషాదము, ఆహ్లాదము సమపాళ్ళలో ఉండే నాటకాలు.