Jump to content

పుట:RangastalaSastramu.djvu/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదా|| చేంజ్ లింగ్ (Changeling), మృచ్చకటికము (నం,) రోషన్తారా (తె.).

5.ప్రధానంగా హాస్యకధ, విషాదముపకధ సమ్మిశ్రము: ఉదా|| వింటర్స్ టేల్ (The Winter's Tale)

6.కావ్యన్యాయము (Poetic Justice) పాటించి, మంచివారికి శుభము, దుష్టులకు శిక్ష ఇచ్చే నాటకాలు-- ఉదా|| మృచ్చకటికము (సం.). చంద్రగాస (తె.).

7,శుభాంతమయ్యే డ్రేములు (Drames). "డ్రేం వ్యక్తిత్వాన్ని చిత్రిస్తుంది; నిజమైన కామెడీ పాత్రలజాగులను (Types) తెలుపుతుంది."1

8.హాస్యంతోకూడిన గంభీరేతివృత్తంకల నాటకాలు. ఉదా|| సీక్రెట్ లవ్ (Secret Love)

9.మెలోడ్రామాలు.

10.కావ్యన్యాయంతో అంతమయ్యే వ్యంగ్య రూపకాలు ఉదా|| వాల్పోన్ (Volpone)

11.సంభాషణలు, ఇతివృత్తము హాస్యరస ప్రధానాలై సుఖాంతంగా పరిణమించే ఆహ్లాదరూపకాలు. ఉదా|| మెర్రీ వైవ్స్ ఆఫ్ విండర్స్ (The Merry Wives of Windsor), కంఠాభరణము (తె.)

మూకరూపకము (Pantomime)

వాచికాభినయాన్ని తోసిరాజని, అంగికాభినయానికి ప్రాధాన్యమిస్తూ, ఆహర్యసాత్తికావిషయాల సహాయంతో స్వగత, పరగత భావాలను వ్యక్తీకరించే విధానాన్ని 'మూమాభినయము ' అంటారు. అట్టి మూకాభినయంతో నిర్వహించే రూపకము మూకాభినయ రూపకము లేదా మూకరూపకము.


1 "A drame invariably deals with personality, while true comedy deals with types and classes. Comedy is separated from the drame by the substitution of type for individual, insensibility for emotion, moral for pure artificially." --"Introduction to Dramatic Theory", Allardyce Nicoll.