Jump to content

పుట:RangastalaSastramu.djvu/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిపాటి అయింది. పురుషపాత్రలకన్న స్త్రీ పాత్రలకు ప్ర్రాముఖ్యము హెచ్చింది. పాదరక్షలు లేకుండా నృత్యం చేయడాన్ని 1901లో అమెరికాకు చెందిన ఇసొడోర్ డంకన్ (Isodore Duncan) ప్రవేశాపెట్టింది. ఈ నృత్యరూప్లక విధానాన్ని కళారూపంగా తీర్చిదిద్దిన వారిలో ప్రముఖుడు జీన్ జార్జినోవెరీ (Jean George Novery), దీనిలో ఆహార్యరంగాలమరణలకు ప్రాముఖ్యము తగ్గి, భావప్రకటనకు విలువహెచ్చినది.

నృత్యరూపకాలు స్వరకల్పనతో 19 వ శరాబ్ధిలొ ప్రచురిరము కాసాగినవ్చి. రష్యాలొ నృత్యరూపక శిల్పము మహోన్నత దశను అందుకొన్నది. దానికి ఉదాహరణంగా శ్వాన్ లేక్ (Swan Lake), ఆర్ఫియస్ (Orpheus)వంటి రూపకాలను పేర్కొనవచ్చు.

అపెరా (Opera)

పాఠ్యంలోని ప్రతిమాట రాగతాళయిక్తంగా పాడే దృశ్యకావ్యమే ఆపెరా, అందువల్ల ఈ రూపకప్రదర్శనలో జంత్రగాత్రాలు ఎక్కువ ప్రాధాన్యము వహిస్తవి. ఆపెరాలు రెండురకాలు: 1.సంభాషణలు పూర్తిగా గేయరూపంలో సాగేవి. 2. గేయసంభాషణలను ఒకదానితో ఒకటి అనుసంధించడానికి వచనం గాని, పధ్యంగాని ఉపయోగించేవి.

ఆపెరా ఒక ప్రత్యేకరూపము ధరించక పూర్వంనుంఛే రూపకాలలో ఆపెరా లక్షణాలు పొందుపడిఉన్నాయి. ఇటలీలొని గొపరూపకాలు (Pastorals) ఇంగ్లండులోని కరాశరూపకాలు (Masks) ఇందుకు ఉదాహరణలు.

ఆపెరా ఇతివృత్తలు పురాణాలనుంచి, చరిత్రలనుంచి ఎక్కువగా గ్రహించబడినాయి. హోమర్ (Homer, టాసో (Tasso), వర్జిల్ (Virgil)ల రచనలు ఈ ఇతివృతాలకు కోశాలు. రాజులు, రాణులు, సేనానులు, బానిసలు ఇందులో వచ్చే ముఖ్యపాత్రలు, ఆపెరాలు సాధారణంగా సుఖాంతంగా ముగుస్తాయి. సంగీతంతోపాటు, రంగాలంకరణ కూడా ఇందులో ప్రాముఖ్యము వహిస్తున్నది.

ఇందులో రూపకక్రియ (dramatic action) కంటె సంగీతమే ముఖ్యము. రంగస్థలంనుంచి ఒక పాత్ర నిష్క్రమించవలసివస్తే 'ఇదుగో వెదుతున్నాను ' అంటూ పాటపాడి నిష్క్ర్తమించడం పరిపాటి.