Jump to content

పుట:RangastalaSastramu.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నృత్య రూపకము

సహాయంతో ఎత్తులు వేస్తారు. ఏదోవధంగా తండ్రిని మోసగించిగాని, మరేదో విధంగాకాని డబ్బు సంపాదిస్తాడు. చివరకు ఆ బానిసబాలిక సామాన్యకుటుంబంలో పుట్టినది కాదని, గౌరవకుటుంబంలో పుట్టి తప్పిపోయినబాలిక అనీ తేలుతింది. కుహనాలు, కుతంత్రాలు, డబ్బ స్సంపదన, యత్నాలు, ప్రేమ, వివాహాలు రోమన్ ఆహ్లాదనాటకాలలో ప్రాధాన్యము వహిస్తూంటాయి.

నృత్య రూపకము (Ballet)

నేపధ్యజంత్రగానహకారంతో, నృత్యమూకాభినయాల ద్వారా కధను, క్రియలను ద్యోతకంచేసే నాటకకళారూపము నృత్యరూపమకు. ఇందులో మూకాబినయమే కాని, వాచికాభినయము ఉండదు. అంగవిక్షేపము, సంచాలనము, హావభావాలు దీని భాష, నృత్యము, సంగీతము, కధావిన్యాసము, రంగాలంకరణ, నృత్యరూపకంలో సమ్మేళనము చెందుతున్నాయి. ఈ నృత్యకళాబీజాలు చరిత్రకు అందనికాలంనుంచి మానవజీవితంలో నెలకొనేఉన్నాయి.

ప్రప్రధసంగీతరూపకాలలో సంగీతము, అబినయము ప్రధానాంశాలు. సంగీతము, నృత్యము ప్రత్యేకకళలుగా అభివృద్ది చెందడంలో అవి నాటకానికి లోబడి ఉండకుండా రెండూ కలిసి ప్రత్యేకకళలుగా నెలకొని, నాటకాన్ని సూత్రప్రాయంగా గ్రహించి తాము అదిక్యము వహించినవి.

యూరప్ ఖండంలో, వార్సేల్సులో, 1581లో ప్రధమంగా నృత్యరూపక ప్రదర్శనము జరిగించని చరిత్రకారుల మతము. 1661లో పద్నాలుగవలూయీ పారిస్ లో జాతీయనృత్యపరిషత్తును (Royal Academy of Dancing) స్థాపించినాడు. రాజాస్థానాలలో స్త్రీలు నృత్యాలు చేయడం జరిగినా, 1681 వరకు ఏ నర్తకీ యూరపులో బహిరంగ రంగస్థలాలమీద నృత్యముచేయలేదని తెలుస్తున్నది.

ఇటీవలివరకు నృత్యరూపకాలలో పౌరాణికకాలంలోని దుస్తువులనే ధరిందేవారు. పిగ్మేలియన్ లో నటించిన మేరీశాలీ మజ్లిన్ దుస్తులతో రంగం మీదకు నృత్యం చేయడాని రావడం నాటి వస్త్రాలంకరణలొ ఒక విప్లవమే!

కాలి బొటనవేలిమీద నిలబడి నృత్యము చేయడం 1830 కి గాని అములులోకి రాలేదు. దీనిని టాగ్లీయోని (Taglioni), ఎల్సర్ (Elsur)లు ప్రచారంలోకి తెచ్చినారు. 19వ శతాబ్దంలో బిగువైన దుస్తులను దరించడం