సంప్రదాయ గ్రీకు రూపకాలు
బృందగానం నుంచి క్రమేణా గ్రీకురూపక మెట్లా జనించినదో "రూపకొత్పత్తి ' ప్రకరణంలొ తెలుసుకొన్నాము. ఇపుడు సంప్రదాయ్హగ్రీకురూపక స్వరూపస్వభావాలు తెలుకుకొందాము. గ్రీకు రూపకాలు మూడురకాలు: 1.విషాదరూపకము (Tragedy) 2.సాతిర్ రూపకము (Satyr Play), 3.ఆహ్లాదరూపకము (Comddy).
విషాదరూపకము (ట్రాజెడీ)
ట్రాజెడీ అనే గ్రీకుపదానికి "మేకపాట" అని అర్ధము. పూర్వము, దేవతోత్సవాలలో బలిమేకచుట్టూ తిరుగుతూ బృందగాయకులు పాటలు పాడే వారు కాబట్టి ఆ పాటలకు మేకపాటలని పేరువచ్చినదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆతరవాత ఈ పాటలలో ఆవిర్బవించి, రూపొందిన రూపకాన్నికూడా ట్రాజెడీ అనే పేరుతోనే పిలవడం ఆచారమయింది.
విషాదంతో ముగిసే రూపకము విషాదరూపకమని సామాన్య నిర్వచనము.
మహోన్నతపదవిలోఉన్న ఒక వ్యక్తి అధ:పతనాన్ని చిత్రించే రూపకమే దిషాదరూపకము. ఈ వ్యక్తినే నాటకపరిభాషలో నాయకుడంటారు.
ఈ నాయకుడు సకల సౌభాగ్యాలతో కీర్తిప్రతిష్ఠలతో తులతూగుతున్నవాడై ఉండవలె. అతనిలోల్ని దువ్యసనము, దుష్టత్వము, అవినీతి వల్లగాక అతనిలొని ఏదో ఒక చిన్నలోపము మూలంగా అతడు మహావిపత్తునకు పాల్పడి పతనము చెందినట్తు చిత్రించవలె.
విషాదరూపకనిర్మాణంలొ ఐదుభాగాలుంటాయి. మొదటి భాగము ఇతివృత్తాన్ని పరిచయంచేసే ప్రస్తావన, ఇందులో స్థలము, కాలము సూచితమవు