Jump to content

పుట:RangastalaSastramu.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపక భేదాలు

తాయి. తరవాత బృందగాయకుల ప్రవేశగేయము. ఆ తరవాత ఐదుపాటలచే విభజితమైన ఐదు సంభాషణభాగాలు లేదా ఘట్టాలుంటాయి. ఇదివరకు బృందగాయకుల నిష్క్రమణగేయంతో రూపకము ముగుస్తుంది. ఈ ఐదుభాగలే తరవాత ఐదు అంకాలుగా రూపొందుతాయి.

బృందగానము గ్రీకువిషాదరూపకాలలోని ప్రధానాంతర్భాగము. మొదట బృందగాల్;యకుల సంఖ్య 50 ఉండేది. ఆ తరవాత ఈ సంఖ్య 12 కు తగ్గింది. వీరిని కొందరు గ్రీకునాటక రచయితలు రూపకపాత్రలుగా తీర్చిదిద్ది నారు. కొందరు కధకు సంబంధంలేనివారినిగా చిత్రించినారు. బృందగాయకులు పాత్రల ప్రవేశాన్ని, శీలాన్ని, పుట్టుపూర్వోత్తరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారు. పాత్రలు నిష్క్రమించినతరవాత రంగస్థలము ఖాళీగా ఉండకుండా వీరు రంగస్థలంమీదే ఉండి ప్రేక్షకులను వినోదపరుస్తూ రంగాలను అనునందిస్తారు. నాయికా నాయకులకు ఇష్టసఖీసఖులుగా వ్యవహరిస్తూ వారి సుఖధు:ఖాలని విని ఓదారుస్తారు. కధమీద, సంఘటానలమీద, మానవజీఫితంమీద వ్యాఖ్యానిస్తూఉంటారు. ఈ బృందగాయకులు గ్రామపెద్దలు మొదలైనవారికి ప్రాతినిధ్యము వహిస్తారు. వీరందరికినీ కలిపి ఒకే ఒక పాత్రగా భావించుకోవచ్చు. నాటకకర్తలు ఈ బృందగానం ద్వారానే తమ సొంతభావాలను వ్యక్తీకరిస్తూంటారు.

గ్రీకు విషాదనాటకాలలొ మరణము మొదలైన ప్రధానక్రియలు రంగస్థలం మీదగాక్ నేపద్యంలో జరుగుతాయి. నేపధ్య్హంలో జరిగిన క్రియా విషయము ప్రేక్షకులకు తెలియజేయడానికి దూత, దాది అనే రెండు పాత్రలను గ్రీకునాటకకవులు సృష్టించుకొన్నారు. నెపధ్యంలో క్రియ ముగిసిన తర్వాత ఈ రెండి పాత్రలలో ఒకటి రంగస్థలంమీదకువచ్చి, ఆ క్రియను పూసగుచ్చినట్లు వర్ణించి చెబుతింది.

మానవునిలోని శోకభయోద్వేగాలను క్షాళనముచేయడమే విషాదరూపకమాశయము. ప్రఖ్యాత గ్రీకునాటకలక్షణవేత్త అరిస్టాటిల్ తన కాలంనాటి విషాదనాటకాలను అధ్యయనముచేసి "ఫొయెటిక్స్" (Poetics) అనే లక్షణ గ్రంధంలో ట్రాజెడీకి కిందిలక్షణముచెప్పినాదు.

"గంభీరమును, స్వయం సంపూర్ణమును, సమగ్రము, నియమితపరిమాణాత్మకమును అయి, రూపకంలోని వివిధాలైన రాగాలలో వేరువేరుగా కన్పట్టే