పుట:RangastalaSastramu.djvu/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపక నిర్మాణము

స్థలైక్యవిషయంలోకూడ కొంత సడలింపు జరిగించి. స్థలము మారినా, స్థలాలన్నీ ఒకపట్టణంలో కధ జరిగినట్టుగా చూపుతూ అంకంమధ్యలో స్థలము మరకుండా ఉంటే చాలునని కొందరు భావించినారు. మరి కొందరు ప్రేక్షకుని కనుచూపుమేరలోని స్థలంలోనే నాటకము నడిపింపవలెనని అభిప్రాయపడినారు.

షేక్స్ పియర్ టెంపెస్ట్, కామెడిఆప్ ఎర్రర్సు లలో తప్ప ఇంకే నాటకంలోను ఈ ఐక్యత్రయాలు పాటించలేరు.

ఇక సంస్కృతనాటకాలలోకూడ ఈ మూడు ఐక్యాలు పాటించబడలేదు. శాకుంతలంలో స్థలకాలు 10. కధాకాలము ఏడెనిమిది సంవత్సరాలు. ఉపకధలు రెండు. అయితే సంస్కృతలాక్షణికులు అంకంలో ఒకరోజు కాలంలో జరిగిన కధను నిబందించవలెననీ, అంకానికీ అంకానికీ మధ్య ఎన్ని సంవత్సరాలు గడిచినా ఒక సంవత్సరమే గడిచినట్లు బ్రాంతి కల్పించవలెననీ చెప్పినారు.

కాలముమారినరి. కాలంతొపాటు రంగస్థలపరిస్థితులు కూడా మారినవి. ఇపుడు తిరిగి ఈ మూడూఇక్యాలు కొంతవరకు అవసరమయినవి. నేటి నాటకరంగంలో వాస్తవికతకు ప్రముఖస్థానము లభించడంవల్ల దృశ్యబంధ నిర్మాణము (Setting) అవశ్యకమైనది. ఈ పరిస్తితులలో ఎక్కువ స్థలకాలు పెట్టుకొంటే సామాన్యంగా దృశ్యాల మార్పుకు సగంకాలము వ్యర్ధమవుతుంది. అదీగాక వ్యయమెక్కువ అవుతుంది. అందుచేత నేటినాటకకర్తలు ఎక్కువగా ఒకే స్థలంలో నాటకమంతా నడుపుతున్నారు.

ఉదా:- ఆత్రేయ --"ఈనాడు". ఆమంచర్ల--"విశ్వంతర".

కాలైక్యాన్ని పాటించడానికికూడా ఎక్కువ యత్నము జరుగుతున్నది. ప్రతాపరుద్రీయకధాకాఅక్రమణిక ఏడు ఎనిమిది నెలలు. విశ్వంతర కధాకాలక్రమణిక 12 గంటలు.

ఉపకధలు చొప్పిస్తే పాత్రలసంఖ్య పెరుగుతుంచి. నాటకము పెరుగుతుంది. ప్రదర్శనకాలము హెచ్చుతుంది. ప్రేక్షకులదృష్టి వికేంద్రీకరణము కావచ్చు. అందుచేత ఆధునికనాటకాలలో ఉపకధలను సాధ్యమైనంతవరకు చొప్పించటంలేదు.