ఐక్యత్రయము
పేర్కొన్నాడు. అయితే గ్రీకు నాటకకర్తలు వీటిని ఖచ్చితంగా అనుసరించినట్టు లేదు సాఫోక్లీస్ అజాక్స్ నాటకంలోనూ, ఇస్కిలస్ యామెనైడ్స్ లోనూ స్థలం మార్పు కన్పిస్తున్నది. ఇస్కిలస్ ఆగ్ మెన్ నాటకంలోను, యురిపెడీస్ నప్లయన్స్ లోను స్థల కాలైక్యాలు కనిపించవు. దీనినిబట్టి ఐక్యాలను కొంత వరకు పాటించినారేగాని ఒక నియమంగా పెట్టుకోలేదని తేలుతున్నది.
ఇంతకూ ఈ సంప్రదాయమెందుకు ఏర్పడిందో తెలుసుకోవడం కూడ అవసరము. నాటి నాటైకరంగస్థలానికి తెర అంటూ లేదు. దృశ్యబంధ (setting) నిర్మారణము లేదు. అంకవిభజన లేదు. బృందగాయకులు రంగస్థలాన్ని విడిచి పెట్టకుండా నాటకారంభంనుంచి తుదివరకు రంగస్థలం మీదనే ఉంటూ అంకాన్ని అంకాన్నీ అనుసంధిస్తూ ఉంటారు. వీరి సమక్షంలోనే నాటకమంతా నదుస్తుంది. బృందగాయకులు సామన్యంగా పౌరపాత్రలు. వీరిని ఇల్లువిదిచి ఒకరోజుకంటె ఎక్కువకాలము ఆ ప్రదేశంలో ఉన్నట్టు చూపడం సహజముకాదని కాలైక్యాన్ని పెట్టుకొన్నట్టు తోస్తున్నది. అట్లాగే రంగాలంకరణము లేకపొవడం, బృందగాయకులు కధాకాలక్రమణిక మూడుగంటలలో అనేకప్రదేశాలు కనిపించినట్టు చూపడం సహజంకాదని స్థలైక్యాన్ని అనుసరించినట్టు భావించవచ్చు. ఏమైనా గ్రీకునాటకకర్తలు ఈ ఐక్యాలను నియమంగా పెట్టుకొన్నట్టు లేదు.
నాటాకంలొ ఉపకధలను ప్రవేశపెడితే ప్రేక్షకులమనస్సు ప్రధాన కధమీద పూర్తిగా నిలవక వికేంద్రీకృత మవుతుందనే భయంతో వస్త్వక్యాన్ని పాటించిఉంటారు.
పునరుజ్జీవనకాలంలో ఈ ఐక్యాలు తప్పనిసరి నియమాలుగా తయారైనవి. అయితే ఆనాటి రచయితలు ఆనాటి పరిస్థితులనుబట్టి కొంత సడలించుకొన్నారు.
"ఒకరోజులో ఒకే స్థలంలో ఒకేఒక సమగ్రక్రియ రంగస్థలాన్ని చివరివరకు ఆక్రమించుకొనేటట్లు చేయవలె"
అనె నియమము వారు పెట్టుకొన్నారు. అయితే కాలైక్యవిషయంలో భిన్నభిప్రాయాలు వెలువడినవి. 12 గంటల కాలమని కొందరు. 24 గంటల కాలమని కొందరు. 5 గంటలకాలమని కొందరు వారించసాగినారు. మరికొందరు నాటకప్రదర్శనకాలము నాటకకధాకాలానికి సరిగా సరిపోవలె అని వాదించినారు.