పుట:RangastalaSastramu.djvu/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపక నిర్మాణము

లకు రచయిత తెలియనీయడు. అతడు బయటపడినతరవాత ప్రేక్షకులకు విస్మయము కలుగుతుంది.

ఇట్లాంటిదే స్త్రీ పురుషవేషము వేసుకోవడం. పురుషుడు స్త్రీవేషము వేసుకోవడం. మొదటిదానికి మధురవాణి పురుషవేషము ఉదారహరణ. రెండవ దానికి ఘటోత్కజుడు శశిరేఖవేషంలో పెండ్లిపీటలమీద కూర్చోవడం ఉదారహరణ.

షేక్సిపియర్ వింటర్స్ టేల్ (Winter's Tale) నాటకంలో కధా నాయిక చ్చిపోయిందనే భ్రాంతిని కలుగజేస్తాడు. చివరకుగాని ఆమె బతికి ఉన్నట్లు చెప్పడు. నాటకాంతంలో కధానాయిక బయటాపడగానే ప్రేక్షకులకు విస్మయము కలుగుతుంది. నాటకంఆరంభంనుంచి చివరివరకు ప్రేక్షకులను ఉత్సుకత ముంచివేస్తుంది.

భాసుడు స్వప్నవాసవదత్తనాటకంలో వాసవదత్త మరణించిందని నాయకపాత్రకు భ్రాంతి కలిగించినాడు గాని ఆమె బ్రతికిఉన్నదని ప్రేక్షకులకు తెలియజేసినాడు.

ప్రసిద్ధేతివృత్తంగల నాటకాలలో ఎక్కడికక్కడ నాటకంలో ప్రేక్షకులను లీనముచేసి ముందు జరగబోయేది మరిచిపోయేటాట్టు చేయగలిగిననాడు ఉత్సుకత, విస్మయము ప్రేక్షములలో రేకెత్తుతవి.

ఐక్యత్రయము (The three utilities)

ప్రతికళ కొన్నికొన్ని సంప్రదాయాలను, నియమాలను సంతతించుకోవడం, కాలక్రమేణా ఆ సంప్రదాయాలను సడలించుకోవడం. కొత్తవాటిని చేర్చుకోవడం కర్రు. నాటకరంగంలో అట్లాంటి సంప్రదాయమే ఐక్యత్రయము. ఇతి-1. స్థలైక్యము, 2.కాలైక్యము, 3.వస్త్రైక్యము.

స్థలైక్యమనగా నాటకమంతా ఒకే స్థలంలో నడవడం. కాలైక్యమనగా పండ్రెండు లేదా ఇరవై నాలుగు గంటలలో (one revolution of the Sun) జరిగిన కధను మాత్రమే నాటకంలో నిబందించడం. వస్త్రైక్యమనగా ఒకేఒక ఒకేఒక కధను మాత్రమే నాటకంలో పొందుపరచడం. ఈ సంప్రదాయానికి మూలపురుషుడు గ్రీకు లక్షణవేత్త అరిస్టాటిల్. ఈయన కాలైక్యవిస్త్వక్యాలను మాత్రమే చెప్పినాడు. కాని స్థలైక్యాన్నిగూర్చి ప్రస్తావించలేదు. అరిస్టాటిల్ అతని కాలంనాటి గ్రీకు విషాదనాటకాలను అధ్యనయనముచేసి ఈ సంప్రదాయాలను