ఫలప్రాప్తి
ఈ దశ నిర్వహణలో షేక్స్ పియర్ విధానము తెలుసుకొవడం మంచిది. నియతాప్తిదశ ముందుకు సాగకుండా కొన్నిసంఘటనలను అడ్డువేసి, రూపకము మురింపు ఆలస్యము చేయడం, దానిమూలంగా తాత్కాలికంగా ప్రేక్షకుల ఉత్సుకత పునరుద్దరించిడం, సుఖాంత రూపకాలలో శుభ మార్గానికి హాకత్ సంఘటనలను అడ్డువేయడం, విషాదరూపకాలలో నాయికా నాయకులు విషాదాంతం నుంచిల్ల్ తప్పించుకోవడానికి మర్గమున్నదని సూచించడం-- ఈ మార్గం ఆధారంగా వ్యవహరించి మృత్యువునుంచి తప్పించుకొంటారా లేదా దాని కౌగిలిలో చిక్కుకొంటారా అనే ప్రశ్న ప్రేక్ష్జకులలో ఉదల్యించి, ఉత్సుకతను తిరిగి రేకెత్తిస్తుంది.
నియతాప్తినిర్వహణ--రూపకాన్ని సుఖాంతము చేయడమా, లేదా విషాదాంతము చేయడమా అనేదాని మెద ఆధారపటి ఊంటుంది. రూపకము సుఖాంతము కావలెనంటే నాయకుని విజయానికి గల అడ్డంకులను ఒక్కొక్క దానినే తొలగించివేసి, ఫలసిద్ధికి మార్గము సుగమము చేయవలె. రూపకము విషాదాంతము కవలెనంటే అప్పటివరకు అణగిపడిఉన్న అడ్డంకులను విజృంభింప చేయవలె; కొత్త అడ్డంకులను కల్పించవలె. ఈ కొత్త అడ్డంకులు పాత్ర శీలంనుంచో, పూర్వ సంఘటనలనుంచో జనించినవిగా ఉండవలనేకాని బయటి నుంచి హఠాత్తుగా వచ్చిపడినవిగా ఉండకూడరు.
సంప్రాప్తి (Conclusion, catastrophe)
రూపకం ముగింపు;దశ ఫలప్రాప్తి, ఈ ముగింపు సుఖాంతముకావచ్చు లేదా విషాదాంతము కావచ్చు. ఏదైనా, రూపకం ముగింపు సంఘర్షణలోనుంచి సహజంగా, హేతుబద్ధంగా జనించినదై ఉండవలె. అంతేగాని 'దేవతాయంత్రం' ద్వారా సమస్యకు పరిష్కాతము తీసుకొని రాకూడదు. దేవతాయంత్రము అంటే సమస్యా పరిష్కారానికి దేవతలను దివినుంచి భువికి దింపడం. సమస్యా పరిష్కారానికి దేవతలను దింపడం ఎక్కువగా యురుపిడిస్ నాటఖంలో కన్పిస్తుంది. తెలుగులో గయోపాఖ్యానము మంచి ఉదాహరణ. కృష్ణార్జునుల ద్వంద్వ యుద్ధాన్ని ఆపడానికి శంకరుడు దిగివస్తాడు.
రూపకంలో సంబంధంలేని వ్యక్తులద్వారా, ఇతర ఉపాయాలద్వారా సమస్యలను పరిష్కరించడం ఆధునిక నాటకాలలోకూడా కనిపిస్తుంది. తప్పిపోయిన పిల్లలు తిరిగి దొరకటం, యాదృచ్చిక సంఘటనద్వారా ప్రతి నాయకుడు