పుట:RangastalaSastramu.djvu/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపక నిర్మాణము

అండ్ క్లియోపాట్రా" రూపకంలో పరాకాష్ట విస్పష్టముకాదు. గౌరవంకంటె ప్రేమకు ఆంటనీ ఎక్కువ ప్రాధాన్యమివ్వడం బలీయమైన ఒకేఒక రంగంలో చిత్రితంకాక చిన్నచిన్న రంగాలలో వ్యాపింఛడంవల్ల ప్రేక్షకుల హృదయాలలో హత్తుకోదు.

ఆధునిక నాటకకర్తలు రూపకము చివరిభాగంలో పరాకాష్ట తీసుకొని వస్తున్నారు. కాని షేక్స్ పియర్ ప్రభృతుల్ సామాన్యంగా రూపక మధ్యంలోనే పరాకాష్టకు తీసుకొని వెళ్ళినారు. మెక్ బెత్ లొ టేంకో ప్రేతము కనిపించిన మూడో అంకము మొదటిరంగమే ఆ రూపకానికి పరాకాష్ట..ఆ రంగంనుంచే మెక్ బెత్ పతనము ప్రారంభమయింది. ఒధెల్లోకి తన భార్య విశ్వాసఘాతకురాలనే నమ్మకము కుదిరినా, నాలుగవ అంకం ఒకటవ రంగము ఆ నాటకానికి పరాకాష్ట. కింగ్ లియ్ర్ నాటకంలో రాజు రాజ్యూన్ని తన కుమార్తెలకు పంచిపెట్టిన ప్రధమాంకం ప్రధమరంగమే ఆ నాటకానికి పరాకాష్ఠ. ఆనిమిషంనుంచే లియర్ కష్టాలు ప్రారంభమయినవి.

నియతాప్తి

A,B ల పోరాటము పరాకాష్ఠకు చేరుకొన్నది. A ఓటమి, B గెలుపు ఖాయమైనవి. వోటమి ఖాయమైనది గదాయని రంగంనుంచి నిష్క్రమించేటంత దుర్భలుడుకాడు A. ఆతరువాతకూడా B తో సమాన ఉజ్జీయే! బలము పుంజుకోలేమా అదృష్టచక్రము తిరగదా ! ఏదోవిధంగా విజయము సాధించలేమా! అనే ఆశతోగానీ ముందే రంగంనుంచి తప్పుకొంటే నవ్వులపాలౌతామని గానీ మానుషంకొద్దీగానీ A నిలబడి పోరాటము సాగిస్తాడు. పరాకాష్ఠనుంచు ఫలప్రాప్తివరకు వ్యాపించే ఈ దశనే నియతాప్తి అంటాము. ఈదశలోకూడా పోరాటము సాగుతూనే ఉంటుంది. B గెలుపు దగ్గరపడుతూ ఉంటుంది.

పరాకాష్ఠలో A ఓటమి, B విజయము ఖాయమని తేలిపోవడంతో రూపకమెట్లా పర్యవసిస్తుందో అనే ఉత్సుకత ప్రేక్షకులలో తగ్గిపోయే ప్రమాదమున్నది. అందుచేత ఉత్సుకత తగ్గిపొకుండా నిలబెట్టడంమీద రచయిత తన దృష్టిని కేంద్రీకరించవలె. ఈ విషయ పరిస్ఠిని అధిగమించడానికి నేటి రచయితలు "ప్రయత్న" దశను సాధ్యమైనంత పొడిగించి, నియతాప్తి దశను సాధ్యమైనంత కుదించివేసి తొందరగా రూపకాన్ని ముగిస్తున్నారు.