పుట:RangastalaSastramu.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందిగ్ధత

వ్యక్తుల మధ్య అయితే రూపకము రెండోభాగంలో ప్రాధాన్యమువహించే పాత్రలను పరిచయము చేయవలె. సంఘర్షణ పాత్ర తంతర సంఘర్షణ అయితే, సంఘర్షణ విజయముపొందే గుణాలను ద్యోతకముచేసి విజయానికిగాని, వినాశనానికి గాని దారితీసే చర్యలు సూచించవలె. ముందు సూచించకుండా కొత్తపాత్రలను, కొత్త ఉద్దేశాలను ప్రవేశపెట్టడం రచయిత అశక్తతను తెల్పుతుంది.

సందిగ్ధత

ఇద్దరు యోధుల ద్వంద్వయుద్ధము గెలుపు, ఓటమి, ఓటమి, గెలుపు సూచనలతో ఎటూతేలకుండా కొంతదూరముసాగిన తర్వాత A గెలుపు అనుమానంలో పడుతుంది. B గెలుస్తాడనేసూచన గోచరిస్తుంది. ఆ సమయాన్ని సండిగ్ఢత అంటారు. ఇంకా కొంతరూరముసాగిన తరవాత A ఓటము ఖాయమని, B గెలుపు ఖాయమని రూఢి అవుతుంది. అంటే ఇక్కడ A,B ల అదృష్ట దిరదృస్టాలు తేలిపోతాయి. ఈ సమయాన్ని పరాకాష్ట లేక మలుపు అంటారు.

పురిటి నొప్పులు శిశుజననానికి దారితీసినట్లు సందిగ్దత పరాకాష్టకు ఆఖరిమెట్టు అనికూడా చెప్పవచ్చు. మనిల్షి గొంగిలించినాడు-సంఘర్షణ; జనము అతని వెంటపడినారు - ప్రయ;త్నము; దొంగ పట్టుబడినాడు- సందిగ్దత; కోర్టులో శిక్షవిధించారు-పరాకాష్ట. జైలుకు తీసుకొనివెళ్ళడం కధకు ముగింపు.

హామ్లెట్ రూపకంలో ఒంటరిగా చిక్కిన రాజును సంపకుండా హేమ్లెట్ వదలివేయడం సందిగ్ధత, ఆతరవాత మంత్రిని చంపడం పరాకాష్ట. ఆ ఘడియనుంచే హామ్లెట్ జీవితము మలుపు తిరిగించి. హేమ్లెట్ చేయి కింద, రాజుచేయిపైన అయినది.

పరాకాష్త సహజంగా, హేతుబద్దంగా, పూర్వసంఘటనలోనుంచి జనించిన దానివలె కనిపిచవలె. ఆయాపాత్రలు, ఆయాపరిస్థితులలో వ్యవహరించినపుడు ఈ పరాష్ట ఆవిర్భవిస్తుందని అనిపించేటట్లు చేయవలె.

రూపక ఫలసిద్ధికి దారితీసే కార్యకలాపాన్ని నిర్ణయించే సంఘటన కధాక్రమంలోనుంచి జనించవలె. అంతేగాని బయటనుంచి కధావిన్యాసంలొకి కృత్రిమంగా చొప్పించకూడదు. "లవ్స్ లేబర్స్ లాస్ట్"లో ఫ్రెంచిరాజు మృతి ఇట్లాంటిదే!

సంఘటనాపరంపరలో వచ్చే మార్పు ప్రేక్షకులకు విష్పష్టముకావలె, దాని ప్రాముఖ్యము విషయంలొ ఏమాత్రము అనుమానము రాకూడదు. "ఆంటనీ