పుట:RangastalaSastramu.djvu/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపక నిర్మాణము యుద్ధానికి కారనము వ్యక్తమవుతాయి. ప్రాతంభంలో సంఘర్షణ-ద్వంద్వయుద్ధము-ప్రారంభమవుతుంది.

ప్రయూత్నము లేదా వ్యాప్తి

సంఘత్షణకు తలపదిన వ్యక్తులిద్దరు ఎవరికివారు విజయము సాధించవలెననే ప్రయత్నము చేయడం ఈ దశలో గోచరిస్తుంది. A,B, అనే ఇద్దరు యోధుల ద్వంద్వయుద్ధము ఈ ప్రయత్నదశలో కొనసాగుతుంది. సంఘర్షణకు తలపడి నిలపడగానే ఎవరికి విజయము లభించదు. ఒకవేళ అట్లా లభిస్తే ఆయోధులిద్దరూ సమఉజ్జీలు కారన్నమాట. అపుడు ఆరంభంలోనే రూపకమంతమవుతుంది. ఆసక్తిదాయకంగా ఉండదు. అసలు రూపకమే లెదని చెప్పవలె.

ద్వంద్వయుద్ధము కొనసాగుతూఉంటే కొంతసేపటికి A ది పైచేయి అయి జయము అతనికే లభ్యమవుతుందని అనిపించవచ్చు; కాని మరికొంత సేపటికి A కి అలపురావచ్చు. B ది పైచేయిఅయి విజయము పొందే సూచనలుప్రదర్శించవచ్చు. ఇట్లా కొంత సేపటివరకు ఒకరిగెలుపు మరొకరి ఓటము అని నిశ్చయించి చెప్పలేనంత తీవ్రంగా పోరాటము సాగుగుంది. అప్పుడు గెలుపు, ఓటమి - ఓటమి, గెలుపు ఇట్లా రూపకము ముందుకూ వనకకూ, వనకకూ ముందుకూ సాగుతూ ఉంటుంది. పోరాటఫలితము తేలదు.

ఈ ఇద్దరు హోధుల ద్వంద్వయుద్ధము రూపకానికి ఆరోపించుకొందాము. ఈ ప్రయత్నదశలో పాత్రలు, వాటి స్వభావాలు, పరిస్థితులు తెలిసిపోతాయి. రెండు పాత్రల భౌతిక సంఘర్షణగాని, అంతర సంఘర్షణగాని కొనసాగుతున్నప్పుడు జరిగే సంఘటనలు ఒకదానినుంచి ఇంకొకటి జనించినట్లుగా సహజమైనట్టివిగా కనిప్ంచవలె. అప్పుడే ప్రేక్షకులలో విశ్వాసభావము కలుగుతుంది. ఈ సంఘర్షణలో చిన్నచిన్న విషయాలు ఎంత ఆసక్తిదాయకమైనవైనా ప్రధాన విషయాన్ని మరుగు పరకుండా జాగ్రత్త పడవలె. పాత్రల ఉద్దేశాలను విస్పష్టము చేస్తూండవలె. మాటలకు, చేతలకు, పాత్రశీలానికి సంబంధాలు నెలకొల్పవలె. ఈ దశలోని ప్రతి సంఘటన, ప్రతిరంగము, ఇతివృత్తప్రగతిలొ నూతన దశనుగాని, పాత్రశీలాన్నిగాని తెలియజేస్తూ మొత్తం కధావిన్యాసంలో ఒక నిర్ధిష్టమైన స్థానమాక్రమించవలె.

సందిగ్ధావస్ధలో ప్రాధాన్యము వహించి రూపక ఫలితాన్ని తేల్ఛేవ్యక్తులకుగాని, అంశాలకుగాని, ఈ ప్రయత్నదశలో సూచించవలె. సంఘర్షణ