ఆరంభము
మధ్యలోనే సంఘర్షణ ప్రారంభముకావచ్చు. సంఘర్షణ ప్రారంభమైన తరవాతకూడా వ్యక్తీకరణ కొనసాగవచ్చు.
సంఘర్షణ పుట్టడానికి కారణభూతమయ్యే సంఘటనాక్రియను ప్రేక్షకులకు ప్రస్ఫుటము చేయడం షేక్స్ పియర్ పద్దతి. అయినప్పటికీ అట్లా పొరస్ఫుటీకరించడం అవసరమని భావింపనక్కరలేదు. ఈ సంఘటన బాహ్యభౌతికసంఘటన కాకపోవచ్చు. ఒకానొక కార్యము నిర్వహించవలెనని పాత్ర మనస్సులో ఆవిర్బవించిన దృఢసంకల్పము కావచ్చు. అందుచేత సంఘటన అనే పదానికి బాహ్యభౌతికార్ధమేగాక మానసిక పరమైన అర్ధంకూడా చెప్పులోవలె. జూలియస్ ఇంటికి విందుకు వెళ్ళవలనని రోమియో మనస్సులో సంకల్పించు కోవడంతోనే నాటక సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఇట్లానే రాజును హత్య చేయవలెననే మేక్ బెత్ సంకల్పంలో మలుపును తీసుఒనివచ్చేదిగా ఉండవలె.
ఉదా|| ఆంటోనీ క్లియోపాట్రాను ఛూడడంతో అతని జీవితము మలుపు తిరగడం.
సరిగా సందిగ్ధతకు దారితీసే ఘట్టంలోనే రూపకము ప్రారంభము కావచ్చు. ఏదో పెద్ద నష్టము ముంచుకొనివచ్చే ఘట్టంలో అసలు రూపకము ప్రాతంభమవుతుంది. సంఘర్షణకు తలపడటం తప్పనిసరి అవుతుంది. హేమ్లెట్ రూపకకధ తెర ఎత్తగానే ప్రారంభముకాలేదు. అంతకుముందు-హేమ్లెట్ రాజు హత్యజరిగిన తరవాత - ప్రారంభమవుతుంది. వెనక జరిగిపోయిన దానిలోనుంచి రూపకము పుట్టుకొని వచ్చింది.
సంఘర్షణ-బాహ్యసంఘర్షణగాని, అంతర సంఘర్షణగాని-పాత్రశీలంలోనుంచే జనిస్తుంది. మేక్ బెత్ శీలంలో ప్రధాంశము దురాశ. ఆ దురాశ మూలం గానే రాజును చంపడాం. అందుచేత సంఘర్షణ పాత్రశీలంలోనుంచి జనిస్తుందని భావించవచ్చు.
సంఘర్షణపడే పాత్రలు సమౌజ్జీలు అయినప్పడే రూపకముముందుకు సాగుతుంది; ఆసక్తిదాయకంగా ఉంటుంది. హేమ్లెట్, క్లాడియస్ లుహరిశ్చంద్ర విశ్వామిత్రులు సమఉజ్జీలే! గట్టిపట్టుదలగలవారే! కధమధ్యలో వెనక అడుగు వేయకుండా ఆసాంతము నిలబడి తమసంకల్పాన్ని సాధించుకోగల వారే!
బాహ్యసమ్ఘర్షణకు ఇద్దరుయోధులు ద్వంద్వయుద్ధము ప్రతీకగా తీసుకొంటే "వ్యక్తీకతణ"లో ఆ ఇద్దదుయోధుల పుట్టుపూర్వోత్తరాలు, ద్వంద్వ