పుట:RangastalaSastramu.djvu/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక నిర్మాణము

(iii) ప్రధాన పాత్రలద్వారా సాధించడం: రూపక నాయికా నాయకులు ప్రతి నాయకుడు ఇతరులతోటి సంభాషణద్వారా సాధించడం.

ఉదా|| డాల్స్ హూస్, ఒకెల్లో.

(vi) ఇన్ని రకాలుగా చిత్రించినా వ్యక్తీకరణ కధానాత్మకంగా ఉండిపోయి, మందకొడిగా నడుస్తుంది. అందువల్ల తెరఎత్తేసరికి ప్రేక్షకుల హృదయాలను అరికట్టే పద్ధసంచలనాన్ని ప్రదర్శించి సూటిగా వ్యక్రీకరణ సాధించడం.

ఉదా|| జూలియస్ సీజర్, మృచ్చకటికము.

విధాన మేదైనా వ్యక్తీకరణ రూపకప్రారంభంలొ పెనవేసుకొని ప్రేక్షకులకు 'ఇదే వ్యక్తీకరణరంగము ' అనిపించకూడదు. ప్రారంభాన్ని అర్ధముచేసుకొనేటంత సమాచారమే అందించేదివావలె.

అయితే ఈ "వ్యక్తీకరణ" రూపక ప్రారంభఘట్టంతో ముగిసి పోతుందని భావించరాదు: రూపకంలో ఆసాంతము ఇది వ్యాపించి ఊంటుంది. ఎప్పటికప్పుడు రంగషలంమీద ప్రత్యక్షంగా ప్రేక్షకులకు చూపడానికి వీలులేని విషయాలు మొదలయినవి ప్రేక్షకులకు ఏదో విధంగా వ్యక్తీకరించవలసి ఉంటుంది.

నేడు రంగస్థలవకాశాలు విస్తృతమైనందువల్ల, వ్యక్తీకరణవిషయంలో రచయిత పని కొంచెము తేలిక అయింది. రంగాలంకరణ, రంగదీపనాలమూలంగా అనేక విషయాలు పాత్రచేత చెప్పించకుండానే ప్రేక్షకులకు తెలియజేయవచ్చు. టెలిఫోన్ సంభషణ, నేమ్బోర్డులు, సెట్తింగు పరికరాలు, కేలండరు, గడియారము మొదలైనవి వ్యక్తీకరణ కార్యభారాన్ని కొంత తేలిక చెస్తున్నవి.

ఏమైనా వ్యక్తీకరణను విజయవంతంగా సాధించడం ఆసిధారావ్రతమే. ఇది నాటక రచయిత శక్తిసామర్ధ్యాలకు ఒరిపిడిరాయి!

ఆరంభము

సంఘర్షణకు ప్రాతంభ మిద్. అయితే వ్యక్తీకరణఘట్టము ముగిసీ ముగియగానే సంఘర్షణ ప్రారంభమవుతుందని భావించరాదు. వ్యక్తీకరణఘట్టం