పూర్వగంగము, ప్రస్తావన
ప్రేక్షకులకు ఈ సమాచరము అందజేయడానికి వీలులేదు. పాత్రలద్వారా మాత్రమే అందచేయవలె. అయితే తమకేదో సమాచార మందజేయడానికే ఈ రంగ మేర్పాటు చేసినారనే భావము ప్రేక్షకులకు కలగకూడదు; కలిగితే విసుగెత్తుతుంది. పాత్రలసంఖ్య ఇరివృత్త క్లిష్టత ఈ కార్యభారాన్ని మరింత క్లిష్టముచేస్తాయి. ఈ చిక్కులనుంచి తప్పించుకొని సమాచారము వ్యక్తీకరించడానికి నాటకకర్తలు అనేకమార్గాలు అవలంభిస్తారు.
(అ) పూవ్రరంగము, ప్రస్తావన (Prologue).
విషయ వ్యక్ర్తీకరణకు పూర్వరంగంలో ఒకపాత్ర నిర్దేశింపబడుతుంది. తెరఎత్తతానే ఆపాత్ర ప్రవేశించి తనకుతానే పరిచయము చేసుకొని సుదీర్ఘ ప్రసంగం ద్వారా అవసరమైన సమాచారమందజేసి నిష్క్రమిస్తుంది. ఈ విధానాన్ని గ్రీకు నాటకకర్తలు ఎక్కువగా అనుసరించినారు. యురపిడిస్ వ్రాసిన 'ఇయోన్ ' అనే రూపకంలో హెర్మిస్ అనే దేవదూత ఈ పూర్వరంగ వ్యక్తీకరణ చేస్తాడు. ఈపాత్ర నిర్వహించే కార్యమే షెరిదాన్ నాటకాలలో "ఒకా నొక నటుని" చేత, షేక్స పియర్ వ్రాసిన "అయిదవ హెన్రీ" నాటకంలో 'కోరస్ ' చేత చేయించడం జరిగింది.
(ఆ) పాత్రచేసే సుదీర్ఘ ప్రసంగము విసుగెత్తకుండా మరొక పాత్రచేత మధ్య మధ్య ప్రశ్నలు వేయించడం ద్వారా విషయాన్ని వ్యక్తీకరించడం---"సింబలిన్" లోవలె.
(ఇ) సంభాషణద్వారా వ్యక్తీకరణను సాధించడం. ఇది మూడు విధాఉ:
(i) నౌకర్లు, సైనికులు-వంటి పాత్రలద్వారా సాధించడం. ఉదా|| హేమ్లెట్. సలోమ.
ఇది సంస్క్రుత రూపకాలలోని ప్రవేశకమువంటితి.
(ii) మధ్యరకం పాత్రల ద్వారా సాధించడం: రూపకప్రధాన పాత్రల ద్వారా కాకుండా ప్రభువులు, జమీందారులు, పెద్ద ఉద్యోగస్థులు మొదలైన మధ్యరకం పాత్రలద్వారా సాధించేది.
ఉదా|| కింగ్ లియర్, వింటర్స్ టేల్.
ఇది సంస్క్రుతంలోని శుద్ధ విష్కంభం వంటిది.