పుట:RangastalaSastramu.djvu/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపకనిర్మాణము

రంగంమీదనుంచి నష్క్రమించడం వంటివి సమస్యాపరిష్కారానికి సాధారణంగా ఉపయోగపడే కొన్ని ఉపాయాలు. ఈ ఉపాయాలద్వారా సమస్యలను పరిష్కరించడం రచయిత అసమర్ధతను రూపకనిర్మాణంలో లోటును చూచిస్తుంది.

గోపనము - విస్మయము (Concealment and surprise)

"కళను మరుగుపరచడంలోనే కళ ఇమిడి ఉన్నది" అని ఆంగ్ల సుభాషితము. దీనినే సంసృతాలంకారికులు 'గోప్యార్ధ గోపన ' మని ఆరు సంధ్యంగ ప్రయోజనాలలో ఒకటిగా పేర్కొన్నారు.

రూపకంలో రచయిగ పాత్రలకు సంబంధించిన ప్రధాన విషయాలు, వారివారి మనస్తత్వం, ఆశయాలు, సంఘటనలు ప్రేక్షకులకు తెలియనీయ కుండా గోప్యంగా ఉంది. ఉత్సుకతను రేకెత్తించి, చివరకు అసలు విషయాలు రంగస్థలంమీద జరిగిన సంఘటనలను కారణాలు-ద్యోతకముచేసి విస్మయము కలిగించవచ్చు. లేదా నాటక కధలోని ముఖ్యశక్తులను ఆరంభంలోనే ప్రేక్షకులకు పరిచయముచేసి ముందు ఏమి జరుగుతుందో అనే ఆసక్తి ప్రేక్షకులలో రేకెత్తునట్లుగా చేయవచ్చు.

మొదటి విధానంలో రచయిత విషయాలను ఎంత గోప్యంగా ఉంచినా ఆ గోప్యత మొదటిసారి నాటక పఠనము, ప్రదర్శన వీక్షణమువరకే పని చేస్తుంది. ఒకసారి గొప్యత సమసిపోయి. అస్దలు విషయము ప్రేక్షకులకు తెలిసిపోయిన తరవార రెండవసారి ఉత్సుకత కలగడం కష్టము. పాఠకుకుని, ప్రేక్షకుని ఎక్కడికక్కడ కధలో నిమగ్నునిచేసి, పూర్వము చదివినదీ, చూసినదీ మరచిపోయేటంతగా చేయగలిగితేనే ఈ విషానము పనిచేస్తుంది.

కన్యాశుల్కంలో మధురవాణి పురుషవేషంలో సౌజన్యారావు పంతులు ఇంటికి వెళ్ళు తుంది. పురుషవేషంలోఉన్న ఆమె మధురవాణియని తచయిత ప్రేక్షకులకు ముందుగా ఎక్కడా చెప్పడు. గిరీశం ఆమెను గుర్తించినా ఈ రహస్యాన్ని బయ్హటపెట్టడు. రంగము కొంత నడచిన తరవాత--

సౌజన్యారావు; - ఏమిటో ! ఆ వికృతం

కొత్తమనిషి:- ఇది!

(అని మారువేషము తీసివేస్తుంది. మారువేషము తీసివేసిన స్త్రీగా నిలబడేసరికి)