రాష్ట్రవిద్యాశాఖాదికారి పర్యవేక్షణలో పై మూడు విశ్వకళా పరిషత్తుల ప్రతినిధులు కలిసికట్టుగా తయారుచేసి ఇచ్చిన పాఠ్యప్రణాళిక కనుగుణంగా గ్రంధరచనకు ప్రత్నాలారంబించినాము. కళాశాలలు తెరవడానికి అప్పటికి వ్యవధి తక్కువగా ఉన్నందువల్ల ప్రధమ సంవత్సర పాఠ్యాంశాలను మాత్రమే పుస్తకరూపంలో అందించడానికి నిర్ణయించినాము.
మూడు విశ్వకళా పరిషత్తులలో ఆయా శాఖలకు అధిపతులుగా ఉన్న ఆచార్యులనుంచి - సాధారణంగా తెలుగు మాతృభాషగా ఉన్నవారినుంచి- ఆయా గ్రంధాల నిర్మాణ కార్యక్రమాలకు నిపుణులను (Experts) ఎన్నుకొన్నాము. వారి సలహా సంప్రదింపుల మీదనే రచయితలను ఎన్నుకొన్నాము. రచనల గుణదోషపరీక్షచేసి తగిన సలహాలిచ్చి మెరుగులు దిద్దడానికి సంపాదకులు (Editors) గా కొందరిని అదే పద్దతిలో నియమించినాము. ఇట్లా సిద్ధమైన వ్రాతప్రతులను వివిధ కళాశాలలనుండి ఆహ్యానింపబడిన అనుభవజ్ఞలైన ఉపన్యాసకుల సమక్షంలో సమీక్షించడం జరిగించి. గ్రంధాలలోని విషయభాగము దోషరహితంగా ఉండేటట్లు చూసి ధ్రువపరిచే బాధ్యత నిపుణులు వహించినారు. అనుభవజ్ఞలైన రచయితలు, నేర్పరులైన సంపాదకులు, సమర్ధులైన సమీక్షకులు, అధికారిక పరిజ్ఞానమున్న నిపుణులు - ఇందరు జతపడి, విశ్వవిద్యాలయ స్థాయిలో తయారుచేసిన పాఠ్యగ్రంధాలను సాధ్యమైనంత తక్కువ వెలకు తెలుగుబాధలో ప్రచురించడం ఇదే మొదటిసారి. వీటిని ఉపాధ్యాయులు, విధ్యార్ధులు సద్వినియోగము చేస్తారని ఆశిస్తున్నాము.
ఈ సందర్బంలో ఈ పాఠ్యగ్రంధాలలో అవలంబించిన శైలిని గురించి, పారిభాషిక పదజాలాన్ని గురించి విశదీకరింపవలసి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1965 లో నియమించిన లక్ష్మికాంతం సంఘంవారు గ్రాంధిక వ్యావహారిక వివాదాలమీద తర్జనభర్జనలు చేసి ఉభయపక్షాలకూ ఆమోదయోగ్యమైన నిర్ణయమొకటి చేసినారు. తెలుగు మొదటిభాషగా చదివే విద్యార్ధులు సాహిత్యము విధిగా నేర్చుకోవలసినప్పుడు గ్రాంధిక భషలో ఉన్న గ్రంధాలను చదువుతారని, ఇతర సందర్బాలలో - అంటే శాస్త్రగ్రంధ పఠనకు - శిష్టవ్యావహారిక రచనలను చదువుతారని, పైసంఘంవారు చేసిన చూచనను కొన్ని మారులతో ప్రభుత్వ మంగీకతించింది. గ్విన్ సంఘంకూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. శిష్టవ్యావహారిక శైలి విషయంలో ఏయే నియమాలను అనుసరించవలెనో లక్షీకాంతం సంఘంవారు విపులంగా నిర్ధేశించినారు. అకాడమి పాలకవర్ల్గ్లంవారు కూడా ఈ చర్యలను పున: పరిశీలించి, భాషా నిపుణు