Jump to content

పుట:RangastalaSastramu.djvu/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భూమిక

భారత పభుత్వంవారి ఆర్ధిక సహాయంతో తెలుగు అకాడమి ప్రచురించిన ఇంటర్మీడియట్ పాఠ్యగ్రంధాలలో ఇది నలభై తొమ్మిదవది. ఈగ్రంధప్రచురణకు దారితీసిన విసేషపరిస్ధితులను, ఈ ప్రచురణలోని విశిష్టతను, క్లుప్తంగా అయినా, వివరించడం మాకర్తవ్యము.

భారతీయ విశ్వకళాపరిషత్తులలో విధ్యాబోధన మాతృభాషలలోనే సాగించడం మంచిదనే సూచనలు చిరకాలంగా వెలువడుతూ ఉన్నాయి. 1966 లో ఏర్పడిన కొఠారి కమిషన్ నివేదిక ఈ సూచనలను ఒక నిర్ధిష్టరూపమిచ్చింది. ఈ నివేదికను భారతప్రభుత్వంవారు ఆమోదించడంలో భారతీయ భాషలలో ఉన్నతవిద్యాబోధన కనువుగా పాఠ్యగ్రంధాలను వాయించడం, ప్రదురించడం ముక్యమయినది. ఇందుకనుగుణంగా భారతప్రభుత్వంవారొక ప్రణాళికను రూపొందించి రాష్ట్రప్రభుత్వాలకు అందజేసినారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారు ఈ సందర్భంలో సముచితమైనసలహాలు ఇచ్చేందుకు మాజీ విద్యాశాఖ కార్యదర్శి శ్రీ జే.పి.ఎల్.గ్విన్ అధ్యర్యంలో సంఘాన్ని నియమించినారు. గ్విన్ సంఘంవారి నివేదిక, భారతప్రభుత్వం ప్రణాళిక భాషావిషయంలోనూ బోధన విషయంలోనూ చేసిన సూచనలమేరకు ఈ అకాడమీని స్థాపింఛడం జరిగినది. 1969-70 నుంచి వెలుగులోకి రెండేళ్ళ ఇంటర్మీడియట్ కోర్సుకు కావలసిన పాఠ్యగ్రంధాలను వ్రాయించి ఉంచడం. శాస్త్రగ్రంధరచనకు అవశక్యమైన పారిభాషికపదాలను సమకూర్చడం మొదలైన బాద్యతలు వర్యవసానంలో తెలుగు అకాడమి విధులుగా నిర్ణయించినాయి. ఈ గ్రంధాల ప్రచురణకయ్యే మొత్తం ఖర్చును భారత ప్రబుత్వము భరించడానికి సమ్మతించినది. రాష్త్రంలోని ఇంటర్మీడియట్ కోర్సులతో సంబధంమున్న ఆంధ్ర, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వకళాపరిష;త్తులు వారికి కావలసిన సహాయ సహకారాలను అందజేయడానికి అంగీకరించినవి.