పుట:RangastalaSastramu.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఘర్షణ

(climax), E: నియతాప్తి (resolution) F: సంప్రాప్తి (conclusion) ఈ రేఖాచిత్రము హేమ్లెట్ (Hamlet), జూలియస్ సీజర్ (Julius Caesar) రూపకాల కధాసరళిని సూచిస్తుంది. మరాకాష్ఠ సరిగా మధ్యలో, అంటే మూడో అంకంలో వచ్చి రూపకాన్ని రెండు సమభాగాలు చేస్తుంది. హేమ్లెట్ మంత్రిని సంపడంలోఅతని బలము సన్నగిల్లి పతనము ఆరంభవమవుతుంది. ఇదే ఆరూపకానికి పరాకాష్ఠ. ఈ సంఘటాన మూడో అంకంలో జరిగి రూపకాన్ని రెండుగా విభజించింది.

అయితే పరాకాష్ఠ రూపకం మధ్యలోనే రావలెననే నియమములేదు. కింగ్ లియర్ (King Lear) రాజు తన కుమార్తెలకు రాజ్యము పంచడం తోనే పరాకాష్ఠ వస్తుంది. అది మొదటి అంకంలోనె జరిగింది. అంటే పరాకాష్ఠ మొదటి అంకంలోనే వచ్చింది. ఇప్పుడు రేఖా చిత్రము ఇట్లాఉంటుంది.

ఒధెల్లో (Othello) నాలుగో అంశము మొదతి రంగంలో డెస్డెమూణా (Desdemona) ను చంపవలెనని నిశ్చయించుకోవడమే ఆనాటకానికి పరాకాష్ఠ. అప్పుడు రేఖాచిత్రము ప్రక్కపుటలో విధంగా ఉంటుంది.