పుట:RangastalaSastramu.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపక నిర్మాణము

లుగా విబజితం కావడం ఆచారమయిందని విమర్శకులు బావిస్తున్నారు. అయితే ఒక్కొక్క అంకంలొ ఒక్కొక్కదశ గీతగీసినట్లు చిత్రింబబడుతుందని చెప్పలేము. మొదటి అంకంలో కొంతవరకు వ్యాపించవచ్చు. ఇట్లాగే తక్కిన దశల విషయంలో కూడా.

అయితే సంఘర్షణకు దారితీసిన పరిస్థితులు. సంఘర్షణలో చిక్కు కొన్నవారి వైనము, శీలము, సంబంధ బాంధవ్యాలు పాఠకులకు ప్రేక్షకులకు తెలిసినపుడే రూపకము చక్కగా అర్షమతుంది. అందుచేత ఈ విషవ్యక్తీకరణను రూపకంలో మరొక విభాగంగా తీసుక్జోవలసిఉన్నది. దీనిఎ వ్యక్తీకరణ (exposition), ప్రవేశిక (Introduction or obligatory scene) అంటారు. దీనిని ఆరంభానికి (Initial incident) ముందే చిత్రించవలె.

రూపక కధావిన్యాసాన్ని అంటే రూపకరేఖను రేఖాచిత్రంగా రూపొందించవచ్చు. ఫ్రెటాగ్ (Fretag) అనే విమర్శకుడు ప్రప్రధమంగా ఈ రేఖాచిత్రాలను రూపొందిచినాడు. ఆ తరవాత అనేకులు రకరకాల చిత్రాలద్వారా ఈ రూపకగతిని, లేదా రేఖను చూపినారు. హెట్సెన్ రూపొందించిన రేఖా చిత్రాలు ఈ దిగువ ఇవ్వబడినవి.

ఈ రేఖా చిత్రంలో -A: వ్యక్తీకరణ (exposition), B: ఆరంభము (initial incident), C: ప్రయత్నము (growth of action), D: పరాకాష్ట