పుట:RangastalaSastramu.djvu/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఘర్షణ

ప్రారంభమైన సంఘర్షణ క్రమంగా క్లిష్టమవుతూ ఒక దశలో అవరో ఒకరు గెలుపొందుతారు అనే విషయము రూఢి అవుతుంది. ఆ తరవాత ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరకు ఆ వ్యక్తికే విజయము లభిస్తుంది. రూపక మంతమవుతుంది. ఇట్లా సంఘర్షణ రూపకంలో ఆద్యంతమూ ప్రధానపాత్ర వహిస్తుంది. అందువల్లనె మానవుని దృఢనిశ్చయము వ్యక్తావ్యక్తాలైన శక్తులతో సంఘర్షణకు పూనుకోవటమే నాటకము.

A, B అనే ఇద్ద్దరు ద్వంద్వయుద్ధము చేస్తునారనుకొందాము. వీరు వ్యక్తులు కావచ్చు లేదా రెండు భావాలకు ప్రతీకలు కావచ్చు. ద్వంద్వయుద్ధము ప్రారంభించిన కొంతసేపటికి A కి అలపురావచ్చు; బలముతగ్గి పోవచ్చు, B ది పైచేయికావచ్చు. ఒక దశలో A ఓటము, B గెలుపు తధ్యమనే భావము కలుగురుంది. ఈ దశనే పరాకాష్ట (Climax) అంటారు. ఆ తరువాత A,B లు గెలుస్తూ ఓడుతూ ఉంటారు. చివరకు B గెలుస్తాడు. A ఓడిపోతాడు. నాటకము పూర్తి అవుతుంది. ఇట్లా క్రమబద్ధంగాసాగే ఇతివృత్త సరళినే రూపరేఖ (Dramatic line) అంటారు.

ఈ కధా సరళిని లేదా రూపరిలేఖను ఏమీ ప్రధాన దిశలుగా విభజించుకోవచ్చు.

(1) "ఆరంభము" ("Initial incident or point of attack") ఈ దశలో సంఘర్షణ ప్ర్రారంబ మవుతుంది.

(2) "ప్రయత్నము" ("Rising action or complication") ఈదశలో సంఘర్షణ తీవ్రమవుతుంది.

(3) "పరాకాష్ట "లేదా" ప్రాస్త్యాక" (Climax or crisis, Turning point) ఈదశలో సంఘర్షణ పడు;తున్న ఇద్దరిళో ఒకరి బలమదికమై అంతిమవిజయము అతనిదే అనే నిశ్చయము గోచరిస్తుంది.

(4) నియతాప్తి ("Falling action or Resolution or denouncement") ఈ దశలో విజయనికి మార్గము వివిధ సంఘటనలద్వారా విస్పష్టమవుతుంది.

(5) ఫలప్రాప్తి ("Conclusion or Catastrophe)

ఈ దశలో సంఘర్షణ అంతమవుతుంది. విజయము లభిస్తుంది. రూపకము అంతమతుంది. ఈ అయిదు దశలనుబట్టి రూపకము అయిదు అంకా