Jump to content

పుట:RangastalaSastramu.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపక నిర్మాణము

(2) ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ హేమ్లెట్ X క్లాడియస్. హెరిశ్చంద్రుడు X విశ్వామిద్రుడు.

(3) వ్యక్తికి, విధికి తేడా ప్రిస్థితులకు మధ్య సంఘర్షణ. ఈడిసస్ రాజు నాటకము, చంద్రహస, ఎన్.జి.ఓ.

(4) రెండువర్గాల (Classes) మధ్య సంఘర్షణ. పెట్టుబడిదారుకు కార్మికులకు సంఘర్షణ "కూలి" "నేతబిడ్డ" గోర్కీ "శత్రువులు"

భూస్వామి లేదా జమీందారుకు రైతుకు సంఘర్షణ. "మాభూమి", "పేదరైతు"

(5) వ్యక్తికి, సాంఘిక సంప్రదాయాలకు సంఘర్షణ. "ఆంటిగన్", "వరవిక్రయము".

(6) తనలో తనకే భావ సంఘర్షణల్. హేమ్లట్ నాటకంలో హేమ్లట్ విచికిత్స (to be or not to be) "ఆత్మవంచనలో" "రాణీ" పాత్ర. 'వాల్మీకి ' లో వాల్మీకిపాత్ర. శాకుంతలంలో శకుంతల దుష్యంతునిముందు తన ప్రేమ వృత్తాంతము తెలిపి తనను స్వీకరించుమని కోరినపుడు దుష్యంతుని మనస్సులో బయలుదేరిన సంఘర్షణ.

(7) రెండు మతాలమధ్య లేదా విభిన్న తాత్విక నిద్ధాంతాల మధ్య సంఘర్షణ. "ప్రబోధ చంద్రోదయము". "విశ్వంతర"

(8) రాజకీయ సంఘర్షణ. "ముద్రారాక్షము", "రెందవ రిచర్డు నాటకము", "అల్లూరి సీతారామరాజు."

సంఘర్షణ రూపకమంతటా వ్యాపించి దానికి జీవముపోస్తుంది. సంఘర్షణ ప్ర్రారంభంలో అసలు ఇతివృత్తము ప్ర్రారంభమై సంఘర్షణల్ అంతము కావటంతో రూపకంకూడా అంతమవుతుంది. ఈ ఆద్యంతారాలమధ్య సంఘర్షణ పెంపోందుతూ, క్రమబద్ధమైన పద్ధతిలో నడుస్తూఉంటుంది. రెండు శక్తులమధ్య