పుట:RangastalaSastramu.djvu/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఘర్షణ

to its own destruction" అన్న బీజంలో Ruthless ambition శీలాన్నీ leads సంఘర్షణనూ, destruction ఫలితాన్నీ సూచిస్తున్నవి.

ఒక వరలో రెండుకత్తులు ఇమడనట్లే ఒకే రూపకంలో రెందు కధా బీజాలు ఇమడవు. అందువల్ల అట్టిపనికి ప్రయత్నిస్తే ఇరివృత్తము అతి విస్తృతమై సమగ్రతను కొల్పోతుంది.

ఏ ఒక కధాబీజమూ సార్వకాలికము, సార్వజనీనము కాదు. అయితే ఏకధా బీజాన్ని రచయిత స్వీకరిస్తాడో దానికి అనుగుణంగానే తన ఇతివృతాన్ని నడపవలె. కధాబీజము ఒకటై, ఇరివృత్త ఫలము ఇంకొకటి కాకూడదు.

సం ఘ ర్ష ణ (Conflict)

""విపార్యాలు, సంఘర్షణలు, ఆడ్డంకులు, అపాయాలు- వీటి అరిగమనంనుంచి రూపకము నిర్మించబడుతుంది."

కధాబీజాన్ని విశ్లేషించుకోవటంలో ప్రధానక్రియ సంఘర్షణ అని తెలుసుకొన్నాము. మానవుడు అనుక్షణము ప్రకృతితో, పరిసరాలతో, తోటిమానవులతో, విధితో, తన అంతరాత్మతో సంఘర్షణపడుతూ ఉంటాడని రూపక నిర్వచన సందర్భంలో గ్రహించినాము. మానవ జీవితము సంఘర్షణమయమనే చెప్పవలె.

మానవుడు అనేకశక్తులతో పోరాడుతూ ఉంటాడు. అయితే అతని జీవితంలో చెప్పుకోతగ్గవి, జీవితంతో ముడివడినవి. రూపకంగా మలచదగినవి కొద్ది సంఘర్షణలే ఉంటాయి. రూపకము ఆకొద్ది సంఘర్హణలచే చిత్రిస్తుంది. సంఘర్షణాత్మకమైన ప్రధాన సంఘటనలు ఇట్లా విభజించుకోవచ్చు.

(1) రెండు పక్షాలమధ్య సంఘర్షణ.

ఇంగ్లీషు సైన్యానికి ఫ్రెంచి సైన్యానికి మధ్య యుద్ధము(ఐదవ హెన్రీ నాటకము)

పాండవ పక్షానికి కౌరవ పక్షానికి మధ్య యుద్ధము (పాండవవిజయము)


1."The drama is built out of contrasts and conflicts". out of obstacles and dangers and their overcoming"

---John Dolman, "Art of Play Production"