Jump to content

పుట:RangastalaSastramu.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపకనిర్మాణము

నాటకంలో హరిశ్చండ్రుని ప్రతిక్రియ అతని శీలంలోనుంఛే జనించింది. నాటక మంతా అతని సత్యవ్రతశీలంమీదనే ఆధారపడిఉన్నది. ఆశీలం లేకపోతే ఇతివృత్తమే లేదు. దీనిని బట్టే శీలంలోనుంచే కార్యవ్యాపారమవిర్భవిస్తుందని చెప్పవచ్చు.

కధాబీజము (Premise)

గింజను భూమిలో నాటితే ఆగింజను చించుకొని రెమ్మవచ్చి మొక్క అయి, చివరకు పెద్దవృక్షంగా రూపొందుతుంది. ప్రకృతి ధర్మంవల్ల అంత పెద్ద వృక్షము చిన్నగింజలో ఇమిడిఉన్నది. ఏగింజనాటితే అదే మొక్క మొలుస్తుంది. అయితే గింజ మంచిదిఅయి ఉండవలె.

రూపకేతివృత్తంలోకూదా ఇంతే. అంతపెద్ద ఇతివృత్తము కధాబీజంలో ఇమిడిఉంటుంది. గింజను చీల్చుకొని మొక్క పైకివచ్చినట్లే కధాబీజంలో నుంచి ఇతివృత్తము వెలికివచ్చి, పెరిగి పెద్దదై తగిన ఫలాన్ని ఇస్తుంది. గింజ మంచిది కావటం ఎంతావశ్యకమో కధాబీజము క్రమబద్దంగా ఉండడంకూడా అంతే ఆవశ్యకము.

రూపకము రచించవలెననే తలంపుతో రచయిత ఒక నీతివాక్యాన్నిగాని, ఒక నానుడినిగాని, ఒక సిద్ధాంత వాక్యాన్నిగాని ప్రాతిపదికగా తీసుకోవచ్చు. మనసులో తళుక్కుమన్న ఒక భాగాన్ని గాని, తానువిన్న లేదా చూచిన ఒక సంఘర్షణనుగాని, పాత్రనుగాని, ప్రచారంలోఉన్న ఒకానొక ప్రసిద్ధ కధను గాని రూపకంగా మలచవలెనని తలపెట్టవచ్చు. అప్పుడు తాను ఎంచుకొన్న భావసాతాంశాన్ని సాధారణీకరించి (generalise) క్రమబద్దమైన ఒక ప్రాతిపదికగా రూపొందించుకొంటాడు. అదేబీజము. ఆబీజంలోనుంచి మహావృక్ష సదృశమైన ఇరివృత్త మావిర్బవిస్తుంది. ఈ బీజము రచయిత అభిప్రాయాన్ని వెలువరిస్తూ అతని లక్ష్యాన్ని సూచించేదిగా ఉండవలె.

ఉదాహరణకు "సత్యమేవ జయతి" - అంటే 'సత్యమే జయించి తీరుతుంది ' అన్న బీజంలో సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరిగితే అందులో సత్యానికే జయమూన్న భావము ఇమిడిఉంది. 'సత్యవ్రతము శీలంగాగల వ్యక్తికి, అసత్యానికీ సంఘర్షణ వచ్చినప్పుడు సత్యవ్రతునికే జయము లభిస్తుందిళ్ అన్న భావమందులో సూచింపబడింది. అట్లాగే "Ruthless ambition leeds