పుట:RangastalaSastramu.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇరివృత్తము

"క్రియలేనిదే విషాదరూపకము ఉండదు. శీలచిత్రణములేకున్నాల్ విషాదరూపకము ఉండవచ్చు"1 అని పాత్రశీల ప్రాముఖ్యాన్ని త్రోసిపుచ్చినాడు. దీనికి కారణాన్ని వివరిస్తూ క్రియలకు లేదా కార్యవ్యాపారాలకు శీలమే కారణమైనప్పటికి ట్రాజెడీ అనుకరించేది మానవులను కాక క్రియలను, జీవితాల్న్ని కావడంచేత పాత్రల సుఖదు:ఖాలు వారి క్రియలమీద ఆధారపడిఉండడంవల్ల క్రియలకే అంటే ఇతి వృత్తానికే ప్రాముఖ్యమని అరని వాదన. ఈ విషయంలో అరిష్టాటిల్ భావాన్ని వ్యాఖ్యానిస్తూ ప్రధానేతివృత్తానికి అనుగుణంగా నాటకీయ సన్నివేశాలనుంచి పాత్రలు తమంతతాము పెంపొంది రూపొందుతాయి అని బుచర్ (Butcher) పేర్కొన్నారు.2

పాత్రశీలంకంటె ఇతివృత్తానికే ప్రాధాన్యమన్న విషయము, సన్నివేశాలనుంచే పాత్రలు పెంపొందుతాయన్న విషయము వివాదాస్పదాలు.

అయితే ఆధునిక విమర్శకులు ఇత్వృత్తంకంటె పాత్రశీలానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. పాత్రశీలంనుంచే క్రియలు (అంటే ఇతివృత్తము) పుట్టిపెంపొందుతూ ఉంటవని వారు అభిప్రాయపడుతున్నారు.

"పాత్రశీలము ఇరివృత్తాన్ని నిర్మిస్తుంది కాని ఇతివృత్తము పాత్ర శీలాన్ని నిర్మించదు" అని అంటారు గాత్స్ వర్దీ. లాజోస్ అగ్రీ ఈ వాననను బలపరుస్తూ "ఈడిపెస్ ముక్కోపి కావటంమూలాననే రోడ్డుమీద అదురైల్న అపరిచితుని చంపినాడు. మొండి పట్టుదలకలవాడు కావడంవల్లనే లీయస్ రాజును సంపినవాడెవడో తెలుసుకోవటానికి విశ్వప్రయత్నము చేస్తాడు. నిజాయితీపరుడు కావటంవల్లనే తన పాపానికి తానే శిక్ష విధించుకొంటాడు"-- అని అభిప్రాయపడుతున్నాడు.

ఈ మాటలనుబట్టి పాత్రశీలమే సంఘర్షణకు దారితీసే కార్య వ్యాపాకాలను సృష్టిస్తున్నదని వీరి అభిప్రాయంగా చెప్పచచ్చు. అట్లానే హరిశ్చంద్రుడు సత్యవ్రతశీలుడు కాబట్టే విశ్వామిత్రునితో సంఘర్షణ వచ్చింది. హరిశ్చంద్ర


1. Without action there can not be a trajedy, there may be without character." --Butcher, "Theory of Poetry and Fine Art" P.27

2.Characters will grow and shape themselves out of the dramatic situations in conformity with the main design".

--Butcher, "Theory of Poetry and Fine Art". P 351