పుట:RangastalaSastramu.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. రూపక నిర్మాణము Structure of the Play

"ఇగివృత్తంతు నాట్యస్యశరీరం పరికల్పితం పంచభి; సంధిభి స్తన్య విభాగ: పంప్రకల్పిత:"

భరతముని ఇట్లా ఇతివృత్తాన్ని శరీరంలో పోలిస్తే అరిస్టాటిల్ జీవ శక్తి (Life blood)తో పోల్చినాడు.

మానవశరీరంలోని వివిధాంగాలు సక్రమంగా పొందికగా తగుపరిమాణంలో ఉండి ఒకదాని కొకటి అనుసంధితమై ఒక దానిలొనుంచి ఒకటి సహజంగా వచ్చినట్లు తోచినపుడే శరీరము సమగ్రంగా సౌష్టవంగా గమణీయంగాఉండి చూడ ముచ్చటగా ఉంటుంది. అట్లాకాక వివిధాంగాలు, తగు పరిమాణంలో లేకనో, లేదా అంగం లోపించి, సరిగా పనిచేయకపోతేనో ఆ శరీరసౌష్టవము సమగ్రత కోల్పోయి వికృతంగా ఉండుంది.

మానవ శరీరంవంటిదే రూపక శరీరంకూడా. రూపక శరీరాన్ని ఇతి వృత్త్ము (Plot) అంటున్నము. వివిధాంగాలు మానవశరీరంలో ఇమిడి ఉన్నట్లే రూపకేతివృత్తంలో కూడా ఇమిడిఉన్నాయి. జీవ శాక్తితోకూదిన ఇతివృత్తమే రూపకమని చెప్పవచ్చు. అట్లాగే శీలంతో కూడిన ఇతివృత్తమే రూపకము. జీవశక్తిలేని రూపకము శవదృశము. అట్లాగే పాత్రశీలములేని ఇతివృత్తము నిర్జీవము, శవప్రాయము.

రూపకానికి ఇతి వృత్తము, పాత్రశీలము రెండూ అవసరమైతే ఈ రెండింటిలో అగ్రస్థానముదేనికో అనే విషయంలో భిన్నాభిప్రాయాలు పొడసూపుతున్నాయి. అరిస్టాటిల్ "విషాదరూపకానికి అత్యంత అవశ్యకమైనది ఇతివృత్తము. అది దానికి జీవశక్తి, దాని తరవాతనే పాత్రశీలము"1 అంతేకాదు.


1.The plot then is the first principle and as it were, the soul of a tragedy; character holds the second place.

'POETICS' Translation 27.29