పుట:RangastalaSastramu.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రూపక ప్రయోజనము

గ్రీకు లాక్షణికుదు అరిస్టాటిల్ "వస్తువులు ఏ ఫిధంగా ఉండావలెనో అట్టిదానిని అనుకరించవలె" (imitate things as they ought to be) అని చెప్పడంలోని అర్ధము ప్రకృతిని అచ్చొత్తినట్లు చిత్రించడంకాదని తేలుతున్నది.

అరిస్టాటిల్ 'పొయటిక్స్ ' కు వ్యాఖ్య రచించిన బుచర్ పండితుడు పైవాక్యాన్ని చర్చిస్తూ "కళాంఅండము మూలంలో ఉన్నదానిని ఉన్నట్లుగాకాక ఇంద్రిల్యాలకు గోచరించిన విధంగా పున: సృష్టిస్తుంది." అనీ, "అనుకరణ సృజనాత్మక క్రియ" అనీ చప్పడంతో ఈపదాల అర్ధము కేవలం అచ్చుగుద్దే అనుకరణముకాదని స్పష్టమవుతున్నది.

అంతేకాదు, ఏబర్ క్రాంబీ అనే మరొక వ్యాఖ్యాత అరిస్టాటిల్ దృష్టిలో రచనాక్రమమిట్లా ఉంటుంది అన్నభావాన్ని వ్యక్తంచేస్తూ "కవిముందుగా తన భావనాశక్తి ద్వారా ప్రపంచంనుంచి ఆవేశము పొందుతాడు. కవితాకళ ఈ బావావేశాన్ని భాషలో అనుకరిల్స్తుంది." 3 అని అన్నాడు.

దీనివల్ల కూడా అరిస్టాటిల్ దృష్టిలో కవిత్వము పున:సృష్టేకాని కేవల మనుకరణ కాదని వ్యక్త మవుతున్నది.

ఇమ సంసృత లాక్షణికులలో అగ్రేసదుడైన ఆనందవర్ధనుడు "అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి" అనడం మమ్మటుడు కవిసృష్టి బ్రహ్మసృష్టినికూడా మించినదని వర్ణించడం, "నానృషి: కురుతే కావ్యమ్" అని భట్టతౌతుడు చెప్పడం - వీటినిబట్టి చూస్తే సంసృత లాక్షణికులు కవిక్రియను సృష్టిగానే భావించినట్లు స్పష్టమవుతున్నది. "అవస్థానుకృతిర్నాట్యమ్" అన్న దనంజయుదే "యద్యాఒవ్యవస్తు కవిభావన భావ్యమానం తనాప్తియన్నరన రావముపై తిలోకే" (దశరూపోకం 4-85) (అంటే "కవి భావకులచే భావ్యమానమై రసముగాగాని పరిణతి చెందనిదిలేదు" అని భావము) ఈమాటలు అనడంలో కవిది కేవలము అనుకరణముకాదని ధనంజయుని అభిప్రాయ్హమైనట్లు స్పష్టమవుతున్నది.


1."A work of art reproduces its original not as it is in itself but as it appears to the senses"

2."limitation.....is a creative act" Butcher, "Theory of poetry and fine Art" P.154

3. The poet first derives inspiration from the world by the power of imaginations: the art of poetry then imitates this imaginative inspiration in language"

Principles of Literary criticism, P.86