పుట:RangastalaSastramu.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రూపక నిర్వచనము

నిజానికి మానవజీవితమాసాంతము ఆసక్తిదాయకముకాదు. ఏదో ఒకతి రెండు ఘట్టాలే ఆసక్తిదాయకమైనవి. ముక్యమైనవి; అవే జీవితానికి సారమువంటివి; జీవితానికి అవే సంక్షిప్తరూపాలు. లోకంలోని మానవులు చీటికి మాటికి కొట్లాడు కొంటూనే ఉంటారు. నాటకాన్ని వీటిలోని ప్రధాన విషయానికి సంక్షిప్తీకరించి చాలాకాలంనుంచి పోట్లాడుకొంటున్నారనే భ్రమను కల్పించి అవవసరమైన విషయాలు వదిలి వేయవలె. ఇదీ అగ్రీవాదన.

మాజన్ య్హల్ మలియొవస్కీ అనే విమర్శముడు "ఉద్వేగమే జీవితము, జీవైతమే ఉద్వేగము. అందువల్ల ఉద్వేగమే రూపకము: రూపకమే ఉద్వేగము"1 అంటాడు.

మానవుడు ప్రతినిత్యమూ ఏదో ఉద్వేగాన్ని పొందుతూనే ఉంటాడు. అంటే ఉద్వేగాల సంపుటీకరణమే జీవితమని తేలుతుంది. రూపకము జీవిత ప్రతిబింబముకాబట్టి జీవితము, ఉద్వేగాల సంపుటి కాబట్టి ఉద్వేగమే రూపకము. రూపకమే ఉద్వేగము, అంటే ఉద్వేగాల చిత్రణే రూపకమని బావము.

ఆధునికనాటక విమర్శకులలో ముఖ్యుడు గాన్నర్ "పాత్రలు తమకు సంభవించిన జయాపజయాలను తమంతతాము వ్యక్తీకరించుకొనే అవస్థావకం పరను చిత్రించేదే రూపకము"2 అంటారు.

రూపకము దృశ్యకావ్యము కావడంవల్ల రచయిత తానై నేరుగా ఏదీ ప్రేక్షకులకు వ్య్హక్తీకరించడు; పాత్రలద్వారానే వ్య్హక్తీకరిస్తాడు. వారి అఫస్థా పరంపతను చిత్రించడమే రూపక మనడంలో 'అవస్థానుకృతిర్నాట్యం ' అనే దనంజయుని నిర్వచనానికి పై భావము దగ్గరగా వస్తున్నది.

రూపకనిర్ఫచన సందర్బంలో వాడిన అనుకరణ, అనుకృతి (imitation, representation) అనే పదాలను ఆ యా లాక్షిణికులు ఏ నిర్ధిష్తార్ధంలో ప్రయోగించినాడో తెలుసుకోవడం ఎంతైనా అవసరము. లేకపొతే ఈ పదాలకు అపార్ధంకూడా చేసుకొనే అవకాశముంటుంది..


1. "Life is emotion; emotion is life--- Therefore emotion is drama and drama is emotion"--"The science of Play writing"

2.The drama presents a sequence of situation in which characters express themselves through what happens to them which they do or (even) fail to do". Producing the Play. P.11