పుట:RangastalaSastramu.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రూపక ప్రయోజనము

అంటే మానవప్రకృతి (Nature), తత్వము, లోకము అనేఅర్ధాలు చెప్పుకోవలె.

ఈ నిర్వచనాలను అనుసరించి సుజ్ఖదు:ఖాది అవస్థలతోకూడిన మానవ ప్రకృతికి (లోకానికి) అనుకృతే రూంపకమని నిర్ధారణ అవుతున్నది.

రూపక ప్రయోజనము

రూపకప్రయోజనము "మానవజాతికి ఆనందమివ్వడం. హితోపదేశాముచేయడం" (For the delight land instruction of mankind) అని డ్త్రైడెన్ పేర్కొన్నాడు. "హితోపదేశజననం, ధృతిక్రీడా సుఖాదికృత్" "వినోదకరణంలోకే నాట్యమెతదృవిష్యతి" అని భరతముని చెప్పినాదు. ఆనందము, హితోపదేశము రూపక పరమాశయాలు. అయితే మానవప్;రకృతికి ప్రితిబింబము ఆ ఆనందాన్ని కలిగిస్తుందా ఎట్లా కలిగిస్తుంది అన్నప్రశ్నలకు మనము సమాధానము చెప్పుకోవలె.

ఈప్రశ్నకు సమాధానమా అన్నట్లు అరిష్టాటిల్ తన 'పొయటిక్స్ ' (Poetics)లో "అనుకృతిని చూసి ఆనందించే ప్రవృత్తి మన అందరిలోనూ నిక్షిప్తమైఉంది". అన్నాడు.1

నిత్యజీవితంలో మనము అద్దంలో, నీళ్ళలో, చాయాచిత్రంలో మన ప్రతిబింబాన్ని చూసుకొని ఆనందిస్తాము. గ్రీకు పురాణాలలో నార్సినస్ అనే వ్యక్తి నీళ్ళలోని తన నీడనుచూసి, మురిసిపోయి, మోహించి, ఆ నీడను పొందలేక, ఆ నీటిలోపడి మరణించినగాధ ఈ ప్రశ్నలకు మంచి సమాధానము.

మానవ ప్రకృతిలోని లోపాలను, సమాజంలోని లోపాలను ప్రతిబింబింప చేయడం ద్వారా ప్రేక్షకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రూపకము హితోపదేశముచేస్తూ ఉంటుంది. నేటికీ ఒక రచనకు విలువకట్టేటప్పుడు దాని సందేశామేమిటి, మానవాభ్యుదయానికి ఇద్ ఎట్లా దోహదము చేస్తుంది అని ప్రశ్నించడం పరిపాటి.

లాజోస్ అగ్రి అనే ఆధునిక విమర్శకుడు "రూపకము జీవితానికి ప్రతిబింబంకాదు. మనము గ్రహించే జీవిగసారము" అంటాడు.2


1."............no less universal is the pleasure felt in things imitated". POETICS, Butcher's Translation. P.25

2."The drama is not the image of life, but the essence we must condence"--Art of dramatic writing. P 166