"తరవాత" దృశ్యంలో ఏ విధమైన నటన అవసరమో, అదేస్థాయిలో "ప్రవేశించటంలో" " నిష్క్రమించటంలో" కూడా నటన రూపొందవలె. పాత్ర పూర్తిగా నిష్క్రమించి, ప్రేక్షకులకు కనుమరుగైపోయేదాకా, పాత్రకు సహజ సిద్ధమైన స్వభావ, గమన, వాచికాదులు ప్రేక్షకులకు కనిపించేటట్లు రూపొందించవలె. నాటకంలో ప్రత్యక్షసంబంధంలేని. కేవలము ప్రకటనలు చేసే నిర్వాహకులు కూడా, తాము చెప్పేమాటలు సరళంగాను, నిర్ధుష్టంగాను ప్రేక్షకులకు ఆసక్తికరంగాను, చక్కగావినిపించేటాట్లుగానూ చెప్పవలె. నటీనటులు తమ కృషివల్ల కలిగే వ్యక్తిగతమైన అలసట, బాధ, ఆందోళన తమ పాత్రపోషణలో కనిపించకుండా మరుగుపరచుకొని చక్కగా నటించేటాట్లు చేయవలె.
7. క్షమాపణలు నిష్ప్రయోజనము. దర్శకుడు తన కృషికి తగిన మెప్పును ప్రేక్షకులిస్తారనే ఆత్మవిశ్వాసము, ఆశాభావము కలిగిఉండవలె. ప్రేక్షకులకు తాను న్యాయము చేకూర్చలేనేమో అని, తానే అధైర్యపడితే తప్ప దర్శకునిదే అవుతుంది. ప్రేక్షకులు అందుకు బాధ్యులుకారు. ప్రేక్షకానురక్తి సాదించలేననే అనుమానము దర్శకునికే కలిగినప్పుడు, క్షమాపణలు చెప్పుకోవటం వల్ల, సాధించగలిగేదేమీ ఉండదు. మీ కృషి తక్కువై, మీ ఆరోగ్యము బాగుండక, మీ నటీనటులు సహకరించక, ఇతరపరిస్థితులు అనుకూలించక కంగారుపడి, ప్రదర్శన రక్తికట్టదనే అనుమానము కలిగి ఆ పరిస్థితులు వివరించి, ప్రేక్షకులకు క్షమాపణలు తెలుపుకొంటే - వారు మీ తలనిగిమి, వీపు తట్టి, ధైర్యముచెప్పి- "ఫరవాలేదులే' అని మీరు ఎట్లాచేసినా చూస్తారుకోవటం శుద్ధ పొరపాటు. దానికి బదులు వారు ఇళ్ళకువెళ్ళీ హాయిగా నిద్రపోవటానికి నిర్ణయించుకొంటారేగాని, ఆ నాటకము చూడరు.
8. నాటకము ప్రేక్షకులకోసమే అని మరవవద్దు. దర్శకుని అభిరుచులు. ప్రేక్షకాబిరుచులు ఒకటేఅయి, ప్రదర్శన ఇతరవిధాల విజయవంతమయితే అంతకన్న కావలసినదేమీ ఉండదు. నాటకము ప్రేక్షకులకొసమే, దర్శకుని, నటీనటుల ప్రజ్ఞావిశేషాల ప్రకటనకోసం, వారి సరదాకోసంమాత్రమే కాదు. ఉత్సాహంతోను, తెలివితేటలతోను. దీక్షతోను, సాగిస్తే నాటక దర్శకత్వ మంత చక్కని ఫలితాలనూ ప్రోత్సాహాన్నీ కీర్తినీ ఆత్మసంతృప్తినీ ఇచ్చే వ్యాసంగము మరొకటి ఉండదు. విశాల్ దృక్సధము, స్వార్ధరహితమైన కృషి,