Jump to content

పుట:RangastalaSastramu.djvu/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇవిగాక ప్రదర్శన జయప్రదము కవటానికి మరికొన్ని సూచనలు--

1. ప్రేక్షకులలో కుతూహలాన్ని రేకెత్తించవలె. ప్రచారంద్వా, ప్రకటనలద్వారా, తాము చూడవలసిన నాటకప్రదర్శన జరగబోతున్నదనే భావము ప్రేక్షకులలో ముందుగా కలిగియుండవలె.

2. ప్రేక్షకులు సుఖాసీనులయ్యేటట్లు చూసుకోవలె. ప్రేక్షకులు కూర్చుండే ఆసనాలు, ప్రదేశము శుభ్రంగాను. సుఖంగాను ఉండవలె. ఎంత చక్కని ప్రదర్శనమైనా ప్రేక్షకులు ఇబ్బందిగా, బాదతో కూర్చుంటే రక్తి కట్టదు.

3. ప్రేక్షకుల ఏకాగ్రతకు భంగము జరగనివ్వరాదు. ప్రేక్షకులు నాటకాన్ని చక్కగా చూసేటందుకు ఉండే అవరోదాలన్నింటిని తొలగించవలె. బయటి శబ్దాలూ, వారి దృష్టికి ఇబ్బంది కలిగించే కాంతి ప్రకాశన దీపాలూ లేకుండా జాగ్రత్తపడవలె. రాకపోకలకు అనుకూలంగా ఆసనాలు ఎడంగా ఉండవలె. ఆలస్యంగా వచ్చినవారివల్ల ముందు వచ్చినవారికి ఇబ్బంది కల్గరాదు. తెర ఎత్తినప్పటినుండి తిరిగి తెర పడేవరకు ప్రేక్షకాగరంలోకి ప్రవేశము నిషేదించటం ఉత్తమ మార్గము.

4. రంగస్థలంలోని వాతావరణము నిజాయితీకి, సహజత్వానికి తోడ్పడవలె. బ్రహ్మాండమైన రంగసజీవకరణ, దృశ్యాలంకరణ (sets and decor) లేకపోయినా, కేవలము తెరలుమాత్రమే ఉపయోగించినా, అవి శుభ్రంగానూ మడతలు లేకుండాను, కదలకుండా స్థిరంగానూ ఉండవలె. అనవసరమైన్ వస్తువులు లేకుండా, రంగస్థలంమీదఉన్న వస్వువులన్నీ నాటకోచితమైన సహజ వాతావరణానికి దోహదమిచ్చేవిధంగా ఉండవలె.

5. ప్రదర్శన సకాలంలో ప్రారంభింపవలె. ప్రదర్శన ప్రకటించిన కాలానికి ఏమాత్రము ఆలస్యము జరగకుండా ప్రారంభము కావలె. దృశ్యానికీ దృశ్యానికీ మధ్య జాగు ఉండరాదు. ఆలస్యము ప్రేక్షకాసక్తికి, ఏకాగ్రతకు అవరోధమని కరవరాదు.

6. ప్రదర్శన పటిష్టంగాను నజీవ<గామి ఉండవలె. ముఖ్యంగా ప్రవేశనిష్క్రమణాల విషయంలో దర్శకుడు ప్రత్యేకశ్రద్ధ చూపవలె. ప్రవేశించిన