Jump to content

పుట:RangastalaSastramu.djvu/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హము కలిగినంతమాత్రాన తక్కిన తరహాల ప్రేక్షకులను అసహ్యించుకోవటం, తన దర్శకత్వ జీవితాన్ని ప్రతిభనూ పరిమితము చేసుకోవటమే అవుతుంది. ప్రేక్షకులు ఏ అభిరుచికి చెందినవారైనా, ప్రేక్షకులపట్ల తాను నిర్వర్తించవలసిన విధ్యుక్త ధర్మము- "వారిని8 ఆనందపరచడమే" నన్నది దర్శకుడు ఎన్నడూ మరవరాదు. వారి అభిరుచులను అనుమానించటంగాని, తేలిక చెయ్యటంగాని పనికిరాదు.

నటనలోను, ప్రదర్శనలోను అవసరమయ్యే వైవిధ్యమే నాటక ప్రదర్శనను ప్రజాస్వామిక సిద్ధాంతాలపై నిలుపుచున్నది. ప్రేక్షకాదరణ నాటక ప్రదర్శనకు ముఖ్యము. ప్రేక్షకాభిరుచులకూ ప్రేక్షకానంద సాధనకూ, ప్రేక్షక శ్రేయస్సుకు సమన్వయంలేని నాటకప్రదర్శన రాణించదు. అట్టిల్ ప్రదర్శన ప్రేక్షకాదరణలేక తరమరుగున చేరుతుంది. కాబట్టి, దర్శకుని కృషి అంతా ప్రేక్షకానంద సాధనకే అని మరవరాదు. ప్రేక్ష్జకులే దర్శకుని ధ్రువతారలు, ఎట్టి సందర్భంలోను, తన నిశ్చితాభిప్రాయాలు ప్రాతిపదికగా ప్రేక్షకాభిరుచులను విస్మరించరాదు. వారి మనసు రంజింపజేసి, వారికి న్యాయము చేకూర్చవలె. అట్టి ఉత్తమ ప్రదర్శనకు నిర్విరామంగా కృషి చేయవ;లె. ఈ "ఉత్తమ" ప్రదర్శన వారి తలకుమించినదై ఉండరాదు.

నర్తకుడు తా నమ్మే సరుకు నాణ్యాన్ని కొనేవాని మనస్సుకు ఎట్లా పట్టేటట్లు చేస్తాడో; కొనబోయేవాడు అడిగినదిగాక, మరొకటి అమ్మటానికి ప్రయత్నం చేసేటప్పుడు వర్తకుడు ఆవస్తువుయొక్క శ్రేష్టతను, ఉపయోగాన్ని, విశిష్టతను గురించిన నమ్మిక ఎట్లా ప్రయాత్నించి కలుగజేస్తారో, అదే విధంగా, ప్రేక్షకుడాశించినదిగాక, మరొకరమమైన ప్రదర్శన ఇస్తున్నప్పుడు దర్శకుడు ప్రేక్షకులకు మంస్తృప్తి కలిగేటట్లు కృషి చెయ్యవలె. కొనేవారి మనసృప్తి వర్తకునికి ఎంత ముఖ్యమో ప్రేక్షక మనస్తృప్తి దర్శకునకు అంత ముఖ్యము. ఇట్టి ప్రేక్షక మన:ప్రవృత్తిని దర్శకుడు పరిశీలనద్వారా, అనుభవంద్వారా తెలుసుకొని తదనుగుణంగా ప్రదర్శన ఇచ్చినప్పుడే రసవత్తరమైన ప్రదర్శన సాధ్యమవుతుంది. ఈ పరిజ్ఞానాన్నీ, పద్ధతులనూ కరతలామకము చేసుకొని, ప్రేక్షకుల మనస్సులలో ఆనందము కలిగించటమే దర్శకుని లక్ష్యము. ఈ లక్ష్యసిద్ధికి దర్శకుడు నిర్విరామంగా కృషి సాగించవలె.