పుట:RangastalaSastramu.djvu/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. చిల్లర ఖర్చులు: ; పైని చెప్పినవిగాక తక్కిన అన్నిఖర్చులు చిల్లరఖర్చుల జాబితాలో వస్తాయి.

ప్రదర్శన నైపుణ్యము

ఇతర కళాకారులు, తమ కళాసృష్తి ఈనాడు కాకపోతే రేపు, లెదా కొన్ని సంవత్సరాల తరవాత చూసి ఆనందించేవారుంటారని ఆశించవచ్చు: అది సాధ్యమేకూడా. ఈ రమైన ఆశాభావము చిత్రకారులకు, రచయితలకు సరిపోతుంది. నాటక దర్శకునకు ఈ అవకాశములేదు. అతడు ప్రేక్షకులకు, నిర్ణయించిన ప్రదర్శనకాలంలోనే, ఆసక్తి, ఉత్తేజము, అనురక్తి కలిగించవలె. వారిని కవ్వించి, ఏడ్పించి, ఉద్వేగానుభావాలను కలిగించి, భావనాశక్తిని రేకెత్తించి, ఉత్తేజితులను చేయవలె. వారికి కుతూహలాన్ని కులుగజేసి నాటక దృశ్యంపైనా, సంభాషణలపైనా, కార్యకలపాలపైనా, దృశ్య సమీకరణపైనా, రూపకల్పనపైనా ఆసక్తి కలిగించవలె. వారు ఏకాగ్రతతో ప్రదర్శన చూసి, తాదాత్మ్యము పొంది ప్రదర్శనలో భాగస్వాములై, నటీనటులను ఉత్తేజితులను చేయవలె. ఇందుకు అవసరమైన దీక్షాత్మక కృషి, ఆత్మ విశ్వాసము, భావనాశక్తి దర్శకుడు తనలో అంతర్గతము చేసుకోవలె. దర్శకుడు స్థిరమైన అభిప్రాయాలతో నాటకంలోని అంతర్గ బహిర్గత భావాలు, నాటక ప్రధానోద్దేశము, సంభాషణలోని అర్ధము, అంతరార్ధము ప్రస్పుటమయేటట్లుగా, ఉ;త్తమస్థాయి నాటక చిత్రీకరణకు అవసరమయిన కళాత్మకపద్ధతులు అవలంబించవలె.

ప్రేక్షకాభిరుచులు ఆయాసందర్బాలనుబట్టి కొన్ని అపరిపక్వ శైశవావస్థలోను, మరికొన్ని పరిపక్వ స్థాయిలోను ఉండవచ్చు, కొన్ని ప్రేక్షక సమూహాలకు హాస్స్యమే ముఖ్యము కావచ్చు. మరికొన్నింటికి కన్నీళ్ళేగాని, తృప్తినివ్వక పోవచ్చు. ఇంకా కొన్నింటికి మెదడు మేత, వేరే కొన్నీంటికి కధావస్తువు ప్రాముఖ్యము అవసరము కావచ్చు.

కాని, ఈ విధంగా విభిన్న ప్రేక్షక సమూహాలు, విభిన్న అభిరుచులు కలిగిఉన్నా, అవి అన్నీ మంచివే.... అని దర్శకుడు మరవరాదు. దర్శకుడు కొన్నిత్గరహాల ప్రేక్షకులేవచ్చి వారిముందు ప్రదర్శన ఇచ్చేటప్పుడు తన కుత్సా