Jump to content

పుట:RangastalaSastramu.djvu/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఖర్చులు

ప్రదర్శన కయ్యేఖర్చులు నాటకస్వభాన్ని బట్టీ, అది ప్రదర్శించే ప్రదేశాన్ని బట్టీ ఉంటాయి. ఈ విషయము నిర్దుష్టంగా వివరించటం కష్టము. కాని, ఖర్చుల వివరాలు ఈ క్రింది విధంగా ఉంటాయి--

1. రచయితకు పారితోషికము: నాటకము ప్రదర్శించేటప్పుడు రచయితకు అతడు నిర్ణయించిన పారితోషికము చెల్లించటం అవసరము. ఈ పారితోషికము ప్రతిప్రదర్శనకు ఇవ్వవలసి ఉంటుంది. రచయిత చనిపోయిన 50 సంవత్సరాలు తరవాత ఎట్టి పారితోషికము ఇవ్వనక్కరలేదు. ఈ గడువు లోపల ప్రదర్శన హక్కులు గలవారికి పారితోషికము ఇవ్వవలె.

2. నాటకప్రతుల ఖరీదు: ప్రతి నటికీ నటునికీ ఒక్కొక్క నాటైక ప్రతినీ; దర్శకునకు ఇతర సహాయకులకు అవసరమైన నాటకప్రతులనూ కొని ఇవ్వవలె.

3. ప్రదర్శనశాల అద్దె: పూర్వాభ్యాసాలకూ ప్రతి ప్రదర్శనానికీ నాటకశాలకూ ప్రతి ప్రదర్శనానికీ నాటకశాలకు అద్దెతోపాటు విధ్యుచ్చక్తికి మొదలైన ఏర్పాట్లకు దొమ్ము చెల్లించవలె.

4. పరికరాల అద్దె వగైరా: ప్రదర్శనకు, పూర్వాభ్యాసాలకు అవసరమైన రంగపరికరాలు, కాంతి ప్రకాశన సామాగ్రి (lighting equipment), ఆహార్యము, దుస్తులు, రంగ సజ్జీక్రణ సామగ్రి మున్నగువాటికి అద్దె చెల్లించవలె. అంతేకాదు, తిరిగి అప్పజెప్పటానికి, వస్తువులు చేరవేయటానికి ఖర్చులవుతాయి.

5. ప్రచారానికి ఖర్చులు: ప్రవేశపత్రాలు, ప్రకటనలు, కరపతాలు అచ్చొత్తించటానికీ, పత్రికా ప్రకటనలకూ ఖర్చులు అవుతాయి.