Jump to content

పుట:RangastalaSastramu.djvu/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావబాశక్తి, దీక్ష దర్శకునకు ప్రాధమికావసరాలు, ఉత్తమ దర్శకుడు తన ప్రేక్షకులను-వారు పిల్లలుగానీ, పెద్దలుగానీ, సూట్లు వేసుకొన్న భాగ్యవంతులు గానీ, మురికి బట్టల శ్రామికులుగానీ-ప్రేమిస్తారు. వారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చే ప్రదర్శనలిస్తాడు. వారి అభిప్రాయాలతో తా నేకీభవించక పోయినా వారితో వాదానికి దిగడు: వారిని ఎట్టి పరిస్థితులలోను విమర్శించడు. ప్రేక్షకాగారంలోని ప్రేక్షకులకు దర్శకుడు నిశ్చితాభిప్రాయాలుగల నాయకుడుగా వారికి విధేయుడైన సేవకుడుగా, వారి ఊహాజీవితాలలో ఆప్తమిత్రుడుగా వ్యవహరించవలె.