Jump to content

పుట:RangastalaSastramu.djvu/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్న విరామ మేర్పడి, అనుకొన్న ఫలితము సాధింపబడదు. కాబట్టి దర్శకుడు రామారావు తన పూర్తి సంభాషణ చెప్పే ఉ;ద్దేశంతోనే ఉన్నా, సుబ్బారావు అడ్డుగొట్టటంవల్లెనే ఆగిపోయినట్లు, ప్రేక్షకులకు తెలిసేటట్లు ఈ కార్యక్రమము రూపొందించవలె. అందుచేత సుబ్బారావు, రామారావు చివరి రెందుమాటలు పూర్తి కాకుండానే సిద్ధంగా ఉండి, చివరిమాట ముగిసి మిగియకముందే. తమ సంభాషణ ప్రారంభిస్తేనేగాని ఇది సాధింపబడదు. కాబట్టి రామారావు సందర్బానుసారంగా, రచయిత వ్రాసిన మాటలేగాక, మరి రెండుమూడుమాటలు అదనంగా చెప్పేటందుకు తయారై, ఒకవేళ సుబ్బరావు అడ్దుతగలటం ఆలస్యమయితే, దాన్ని కప్పిపుచ్చేటందుకు కూడ సిద్ధపడవలె.

ఉదాహరణకు: రచయిత సంభాషణలు ఇట్లా ఉన్నాయనుకోండి--

రామారావు: నిజమే! కాని--

సుబ్బారావు: అదంతా నాకనవసరం, నువ్వు నేనుచెప్పినట్లు చేస్తావా లేదా అప్పుడు రామారావు తన సంభాషణ అవసరాన్ని అనుసరించి, అడ్డుకొట్టేదారా ఇట్లా పొడిగించవలె.

రామారావు: నిజమే ! కాని-- నేను చెప్పబోయేది ఏమిటంటే- (అనిగాని, లేదా) నిజమే, కాని-నేను చెప్పబోయేది పూర్తిగా విని అప్పుడు నువ్వు సమాధానం చెప్పు-- (అనిగాని) పొడిఒగించుకోవచ్చును.

జాగుకు, అందువల్ల వచ్చే అనవసర విరామాలకు మరొక కారణము- ప్రవేశనిస్క్రమణాలలో ఉండే సంభాషణలు. ఈ సందర్భంలోకూడా రచయిత సూచనలు మక్కికి మక్కిగా పాటించటం కాక, దర్శకుడు తన ఊహాశక్తిని వినియోగించడం ద్వారా, జాగులేకుండా, దృశ్యము నడిపించవలె.

ఉదా: రామారవు, సుబ్బారావు మాటాడుతూ ఉండగా, రంగారావు ప్రవేశించే సన్నివేశము నాటకంలో ఉన్నదనుకోండి. రామారావుతో సుబ్బారావు చెప్పవలసిన సంభాషణ పూర్తి అయిన తరవాత- "రంగారావు ప్రవేశిస్తాడు" అని రచయిత వ్రాస్తాడు. మక్కికి మక్కిగా ఈ సూచన అనుసరించినప్పుడు, రంగారావు నేపద్యంలోఉండి, ఆ సంభాషణ పూర్తిగా అయిన తరవాత బయలుదేరి, రంగస్థలంమీదకు వచ్చి దర్శకుడు నిర్దేశించిన స్థానానికి రావలె. దీనికి కొంత కాలవ్యవధి పడుతుంది. ఈ కారణంవల్ల రామారావు, సుబ్బారావు అంతవరకు జడ్ంగా ఉందిపోవలసివస్తుంది. అందుచేత దర్శకుడు కొంద ముందుగానే,