వస్త్వాశ్రయం (objective)గా ఉండరాదు. ఈ రకమైన సజీవ సృజనాత్మకభావనాశక్తి (organic creative imagination) కలిగేందుకు, తాము ధరిస్తున్న పాత్రల అంతర్గతభావాలు ఊహించగలిగేవిధంగా దర్శకుడు నటీనటులకు కింది ప్రశ్నలవంటివి సూచించవచ్చు--
1. నీవు ఎక్కడనుంచి ఇక్కడికి (ఈ సన్నివేశంలోకి) వచ్చినావు?
2. ఎందుకు వచ్చినావు?
3. ఈ సన్నివేశ మేమిటి?
4. ఫలానా సంఘటన జరిగిందా?
5. ప్రధాన పరాకాస్ఠ సన్నివేశము జరిగినదా?
6. జరిగినదానిని గురించి, ప్రస్తుతము జరుగుతున్నదానిని గురించి నీ మన:స్థితి ఏమిటి నీకు సంతోషంగా ఉన్నదా? విసుగుగా ఉన్నదా? కోపంగాఉన్నదా? ఆశ్చర్యంగా ఉన్నదా? తికమకగా ఉన్నదా? నిర్ల్యక్ష్యంగా ఉన్నదా? మొదలైనవి.
వీటి జవాబులు సక్రమంగా తెలుసుకొంటే నటుడు తన పాత్రకు న్యాయము చేకూర్చినవాడవుతాదు. అందుచేత దర్శకుడు మెరుగులు దిద్దటంలో ఈ విధమైన కృషి చెయ్యవలె.
దర్శకుడు ఈ పూర్వాభ్యాసాలలో నటీనటులను వారివారి పేర్లతో గాక, వారు ధరించేపాత్ర పేర్లతో పిలవటంవల్ల సరిఅయిన వాతావరణ మేర్పడే అవకాశముంటుంది. సక్రపాత్ర్ర స్వభావ చిత్రీకరణకు కావలసిన మన:స్థితి కేవలము దర్శకుని బోధన, శిక్షణవల్లనేగాక నటీనటుల దీక్ష ప్రజ్ఞకూడా తోడ్పడినప్పుడే సాధించటానికి వీలు కలుగుతుంది.
దీర్ఘ సంభాషణలు
అనుభవంలేని నటీనటులకు దీర్ఘ సంభాషణలు ఎట్లా మొదలుపెట్టవలెనో, ఉచ్చారణ, కంఠస్వర వైవిధ్య సాధనలతోను, గంగవ్యాపారాల, కదలికల, భంగిమల జోదిం;పులతోను, ముఖభావ ప్రకటన, అంగ, కరవిన్యాసాలతోను సంభాషణ ఎట్లా రక్తి కట్టించవలెనో మంచి దర్శకుడు శిక్షణ ఇవ్వవలె. దీర్ఘసంభాషణలకు తగిన గతివిన్యాసాలద్వారాను, ముఖ భావ ప్రకటనలద్వారాను సాధించే సంభాషణపద్ధతి ప్రేక్షక తాధాత్మ్య సాధనకు ఉపకరిస్తుంది. దర్శకుడు దీర్ఘసంభాషణలు చెప్పేంతుని విషయమేగాక రంగ