Jump to content

పుట:RangastalaSastramu.djvu/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నటీనటులుపయ్జోగిచవలసిన వస్తువులన్నీ నటీనటులుపోయోగించటంవల్ల, దర్శకుడూహించిన పాత్రగత రంగవ్యాపారాలు ఆచరణలో పెట్టటం వల్ల వాటి సౌలభ్య ఫలితాన్ని ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశ మేర్పడుతుందు.

మొదటి ఐదారు పూర్వాభ్యాసాలలోనూ--

1. నటీనటులు తమ సూచనలను సక్రమంగా అర్ధముచేసుకొని ఆచరణలో పెట్టుతున్నారా లేదా

2. ముఖ్యంగా నటుడు నాటక సమిష్టి కృషిలో తాను తెలుసుకోవలసిన అంశాలన్నీ తెలుసుకొన్నాడా, లేదా సందేహాలున్నవా -- ఈ విషయాలు దర్శకుడు తెలుసుకొని ఆ తర్వార పూర్వాభ్యాసాలు సాగించవలె. తృప్తికరంగా పైఅంశాలు జరగుతున్నప్పుడు దర్శకుడు నాటకంఅర్ధాన్నీ అంతరార్ధాన్నీ వివరంగా, సూక్ష్ంగా సమన్వయపరచి నటీనటులకు తెలియజెప్పవలె. నటీనటులు సంభాషణలు సక్రమంగా అర్ధయుక్తంగా చెప్పేటట్లు జాగ్రత్త తీసుకోవలె. నాటకోద్దేశసమన్వయంలో అందుకు విరుద్ధమైన వ్యక్తిగత భావాలు నటీనటులలో స్థిరపడకముందే వారిని సక్రమధోరణిలో పెట్టవలె. సంభాషణలలోని భావార్ధాలను బోధ పరిచేటందుకు అవసరమైన ప్రశ్నలు వేయవలె. సంభాషణలప్రాముఖ్యాన్నీ, ప్రత్యేకోద్దేశాన్నీ ఉచ్చారణవల్ల, గమనవేగ వైదిధ్యంవల్ల , రంగవ్యాపార-అభినయాల సమన్వయంవల్ల- ఎట్లు ప్రకటించవలెనో వివరించవలె. నాటకంలోని ప్రతిసంభాషణ యొక్క అర్ధము, అది పాత్ర ఏ మన:స్థితిలో చెప్పినది దర్శకుడు నెటీనటులకు తెలియ జెప్పి వారి అభినయము అందుకు అనుకూలంగా రూపొందేటట్లు శ్రద్ధ వహించవలె.