Jump to content

పుట:RangastalaSastramu.djvu/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభ్యాసము చేయించి, అనంతర పూర్వాభ్యాసంలో (continuous rehearsal) చేర్చడంవల్ల వారి భంగిమలు, కదలికలు, సంభాషణలు క్రమబద్ధమై ఆత్మ విశ్వాసము చేకూర్చి, ధైర్యంగా అందరి ఎదటా నిర్థుష్టంగా చేసే అవకాశము కలుగుతుంది.

మొదటి సమీక్ష

పైనపద్ధతిన రెందు మూడుసార్లు నాటకము పూర్తిగా పూర్వాభ్యాసము చేసిన తరవాత, అప్పటి పరిస్థితి సమీక్షించుకోవటం ఉచితంగా ఉంటుంది. ఈ దశలో నటులు తమ సంభాషణలు పూర్తిగా కంఠస్థము చేసి ఉండకపోవచ్చు. వారు తమ పాత్రల స్వభావస్వరూపాలను అర్ధము చేసుకోవటంలోను, సమిష్టి కృషిప్రయత్నంలోను, అంగికవాచికాభినయాల సమన్యయప్రయత్నం (Coordination of speech and movement) లోను ఉంటారు. ఈ సమీక్షా సమావేశంలో దర్శకుడు నటీనటుల సందేహాలు తిరిగి తీర్చి, జవాబులు చెప్పి, వారిసూచనలు విని, నాటకంలోని అంతర్గత భావాలను స్థూలంగా చర్చించవలె. నాటకభావ ప్రాధాన్యము ప్రయోగంలో స్థిరపడి రూపొందేటందుకు ప్రయత్నాలు కేంద్రీకరించవలె. నటీనతులలో లభ్యమయ్యే సామర్ధ్య విశేషంవల్ల, సాంకేతిక విలువల సాధనకున్న అవకాశాలవల్ల, ఏది ప్రయోగంలో సాధ్యమో; ఏది అసాధ్యమో నిర్ణయించుకొని దర్శకుడు తన ప్రణాళికను అవసరంపట్ల మార్చుకొని సరిచేకొని, ఖాయపరచుకోవజ్లె. నిరుపయోగాలు, అర్ధరహితాలు అయిన కదలికలు- నటీనటులకు అవి పూర్తిగా అలవాటై మాన్పవీలు కాని పరిస్థితి ఏర్పడకముందే దర్శకుడు మాన్పించవలె. నటీనటుల ప్రతికదలిక సరళం గాని విశిష్టంగాను, అర్ధయుక్తంగానూ ఉండవలెనేగాని, అనిశ్చితత్వం (hesitation) తోను, సందేహసూచకం (doubtful)గాను ఉండరాదు. ఒక్కొక్కప్పుడు దర్శకుడుద్దేశించిన క్దలిక, రంగస్థలంలోని అభినయావరణ (acting area) పరిమితము కావడంవల్ల సరిగా రూపొందక, నటుడు ఇబ్బంది పడవచ్చు, కాబట్తి, దర్శకుడు నటీనటుల ఇబ్బందులు తెలుసుకొని తన ప్రణాళిక మార్చుకోవలె. సమీక్షద్వారా చర్చలు ముగిసిన తరవాత అవసరమైన ప్రయోగ పద్ధతులు పరిశీలించి నిర్ణయింపబడిన తరవాత, రంగస్థలంమీద, నాటకక్రమంలో పూర్వాభ్యాసాలు సాగిస్తే, నటీనటుల కంఠస్థాయి, కదలికలు, దృశ్యస్వరూపము, దర్శకుడు అవగాహన చేసుకొనే పరిస్థితి ఏర్పడుతుంది. రంగస్థలంపై