పుట:RangastalaSastramu.djvu/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రద్ధ వహించవలె. నటీనటులు ఈ విధంగా పూర్వాభ్యాసము చేసేటప్పుడు, వీలైనంతవరకు రంగస్థలంమీద ఉండవలసిన కుర్చీలు వగైరాలను సగిఅయిన స్థానాలలో ఉంచి, ప్రవేశద్వారాలు నేలపై సుద్ధగీతలద్వారాగాని, రెండు కుర్చీల మధ్య ఎడము ఉండటంద్వారా గాని సూచించవలె. నటీనటులు తమ పాత్రల సంభాషణలు చదువుతూ, దర్శకుని సూచనల ప్రకారము స్థానాల మార్పును రూపొందించవలె. దర్శకుడు ఎప్పటికప్పుడు అడ్దుతగిలి, ఇవ్వవలసిన సూచనలిస్తూ, ఆ సూచనలు నటీనటులు తమ ప్రతులలో వ్రాసుకొనే వ్యవధి ఇవ్వవలె. ఈ దశల్జో నాటకంలోని వరసక్రమము సాధించటం అట్టే ముఖ్యము కాదు. శ్రద్ధత్జో పరిపూర్ణత సాధించడానికి ఎంతో వ్యవధివావలె. ఇది సాధింపబడిన తరవాత, పూర్వాభ్యాసాలు మరించ శీఘ్రంగా, సాఫీగా, నిర్ధుస్జంగా, ఉత్తమ ప్రమాణాలతో జరిగే అవకాశము వృద్ధి అవుతుంది. ఏకముఖత్వంవల్ల గాని సరిఅయిన ఫలితాలు రావు. ఇద్ నటీనటుల, దర్శకుని నిరంతర సాహచర్యంవల్ల సాధింపబడుతుంది. సాయంకాలంమాత్రమే లేదా, ప్రత్యేకదినాలలో మాత్రమే ఈ వ్యాసంగానికి సావకాశమున్నప్పుడు మరింత శ్రద్ధ, దీక్ష అవసరము. అప్పుడు రోజుకొక ద్శశ్యము పూర్వాభ్యాసము చేయవలె. అన్ని దృశ్య భాగాలకు దర్శకుడు సూచనలివ్వవలె. మొదటిదశ పూర్వాభ్యాసాలలో నటీనటులు సహృదయతతో చేసే సూచనలు, విమర్శలు దర్శకుడు స్వీకరించి, చర్చించి నటీనటులకు తృప్తికలిగించి వారిని సమాధానపరచవలె. తన ధోరణికి, నటీనటుల ధోరణికి పాత్రల స్వభావప్రకృతులను గురించిగాని, ఇతర విషయాలను గురించిగాని బేదాభిప్రాయము గలిగినప్పుడు వారి సందేహాలు సహకారంతో తృప్తికరంగా నివారణ చేయవలె. కేవలము ఒకరిద్దరు నటీనటులకు సంబందించిన సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసము ఎక్కువకాలము వ్యయము చేయకుండా, పూర్వాభ్యాసము సాగించి, తర్వాతి పూర్వాభ్యాసంలోపున అందుకు సమబందించిన వ్యక్తులతో చర్చలుచేసి, ఆ సమస్యను పరిష్కరించవలె. ఈ దశలోని పూర్వాభ్యాసము ఉద్దేశము- నటీనటులు వారివారి పాత్రలను అర్ధముచేసుకొనేటట్లు కొన్ని నిర్ధుష్టమైన సూచనలు ఇవ్వటంమాత్రమే.

ప్రేమ సన్నివేశాలు, ఇబ్బంది కలిగించే కష్టమైన ఇతర సన్నివేశాలు మామూలు పూర్వాభ్యాసాలలోగాక, ముందుగా ఆ నటీనటులచేత ప్రత్యేకంగా