పుట:RangastalaSastramu.djvu/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలసినదిగా చెప్పవలె. కేవలము తమ పాత్రలవిషయమే తెలుసుకోవాలని, నాటక స్వరూపము సమగ్రంగా తెలుసుకోనక్కరలేదని భావించే నటీనటులు ప్రయోగానికి అవరోధాలవుతారు. నాటకము సమష్టి కళగా రూపొందినప్పుడే అది పరిపూర్ణత పొందుతుంది. ప్రతి పాత్రధారికి నాటకప్రతి ఇచ్చినప్పుడు, ఈ రమమైన పఠన మవసరమా లేదా అన్న ప్రశ్న నాటక స్వభాన్నిబట్టి ఉంటుంది. నాటకంలో స్థూలంగా అర్ధముకాని అంతర్గతభావాలున్న సందర్భంలో ఈ రమమైన పఠనము తప్పనిసరి అవుతుంది. తగినంత వ్యవధిలేనప్పుడు, నాటకము సరిగా చదవగలవ్ల్యక్తి లేనప్పుడు ఈ ప్రయత్నము విరమించుకోవచ్చు.

తొలి పూర్వాభ్యాసాలు

పైన సూచించినట్లు నటీనతులుగాని, ప్రత్యేకవ్యక్తిగాని నాటల్మౌ చరివిన తరవాత దృశ్య విభనపద్ధతి (blocking out) ప్రారంభమవుతుంది. దర్శకుడు తన ప్రయోగ ప్రణాళికను, ముందుగానే సిద్ధముచేసుకొంటే ఈ కార్యకలాపము మరింత శీఘ్రంగాను, సాఫీగాను నడుస్తుంది. కదలికలు, స్థలనిర్గేశాలు, రంగకార్యకలాపాలు స్థూలంగా నిర్ణయించుకోవలె.

దర్శకుని ప్రణాళిక చక్కగా రూపొందినప్పుడు-- మొదట, దృశ్యాలలోని ప్రవేశానిష్క్రమణాలు ఏర్పాటును, రంగస్థలంపై ఉపయోగించే పరికరాల స్థానాలను, రంగసజ్జ ఏర్పాటును, దర్శకత్వానికి ఉపయోగించే పరిభాషను- ప్రయోగంలో పనిచేస్తున్న అందరికీ దర్శకుడు తెలియజెప్పవలె.

మొదటి పూర్వాభ్యాసంనుంచీ నటీనటులు తగు కదలికలను అనుసరిస్తూ అవి నారి మనస్సుకు పట్టేటట్లు చేయటం ఒకపద్ధతి. నటీనటులు కూర్చుండిఉండే: దర్శకుని సూచనలు వ్రాసుకోవటం, సంభాషణలు కంఠత: వచ్చినతరవాత కదలికలు ఆచరణలో పెట్టటం మరొకపద్ధతి.

చాలా సందర్భాలలో మొదటిపద్దతే మంచిది. కాని అవలింబించే పద్ధతి ఏదైనా, దర్శకుడు చెప్పే సూచనలన్నీ వారి సంభాషణలున్న కాగితాల మీద స్పష్టంగా- కదలికలు, స్థానాలు, నటప్రక్తియలు, రంగవ్యాపారాలు, సంభాషణలోని ప్రత్యేకవిరామాలు, ప్రాధాన్య మివ్వవలసిన మాటలు - నిర్ధిష్టంగావ్రాసుకోవడం ముఖ్యము. దర్శకుడు ఈ పద్ధతియొక్క ప్రాముఖ్యాన్ని, ఉపయోగాన్ని నటీనటులకు బోధపరిచి, మొదటి కొద్ది పూర్వాభ్యాసాలలోనే కదలికలు, నటప్రక్రియలు మొదలైనవి సంభాషణలతో మేళవించి నేర్చుకొనేటట్లు