వలసి ఉంటుంది. అట్లాగే సంభాషల్ణప్రధానాలైన నాతకాలలో వ్యక్తిగత వాచిక శిక్షణమీద ప్రత్యేకశ్రద్ధ అవసరము.
సామాన్యంగా, ప్రదర్శించే నాటకాన్ని చిన్న చిన్న సన్నివేశాలుగా విభజించి (blocking out) అని పూర్వాభ్యాసాలలో విడివిడిగా అభ్యాసము చేయవలె. దీనివల్ల తక్కువ సంభాషణలున్న పాత్రధారులకు అనవసర కాలవ్యయము తప్పించటమేగాక, అవసరమైన పాత్రధారులకు మరింత పటిష్టంజ్గా శిక్షణ ఇచ్చే అవకాశ మెక్కువ దొరుకుతుంది. ఈ ప్రత్యేక వ్యక్తిగతశిక్షణ నటవిద్యార్ధులలోను, ఔత్సాహికులలోను మరింత అవసరము. సామూహిక పూర్వాభ్యాసాలలో దర్శకుడెచే సూచనలు అర్ధముచేసుకొని, తర్వాతి పూర్వాభ్యాసాలలో ఆ సూచనలనుబట్టి మార్పు తెచ్చుకొనే శక్తిసామర్ధ్యాలు సాధారణంగా ఈ రకంనటీనటుల కుండవు. దర్శకుడు పూర్వాభ్యాసాల ప్రారంబానికి, ప్రదర్శన తేదీకి మధ్య ఉన్న వ్యవధినిబట్టి, ఒక నిర్ధిష్ట కార్యక్రమము రూపొందించుకోవలె.
మొదటి పఠనము (First Reading)
చాలామంది దర్శకులు పూర్వాభ్యాసము మొదలుపెట్టేముందు- నాటకము పూర్తిగా నటీనటుల ఎదుట చదవటం అవసరమని భావిస్తాడు. ఇద్ అవసరమా కాదా అనేది పరిస్థితులనుబట్టి ఉంటుంది. అచ్చుపుస్తకాలు లేక నటీనటులు వారివారి పాత్రలు మాత్రమే వ్రాసుకొన్నప్పుడు, ఈ రకంగా నాటకము చదవడం వారు ఆ నాటకాన్ని వారివారి పాత్రల్ దృష్టితోనేగాక సమగ్రంగా అర్ధము చేసుకోవటానికి ఎంతో సాయపడుతుంచి. ఈ ఉద్దేశంతో నాటకము చదివినప్పుటు అది పూర్వాభ్యాసంవలె జరగకూడరు. నటీనటులు స్థలనిర్దేశం సూచనలు అక్కరలేదు. అట్లాగే నటీనటులే ఆ యా సంభాషణలు చదవనక్కలేదు. తెలిసి చక్కగా చదవగలిగినవ్యక్తి - సాధ్యమైతే రచయిత- నాటకాన్ని చదవవలె. నాటకంయొక్క అర్ధాన్నిగురించి తప్ప అడ్డుప్రశ్మలు, అవరోధాలు పనికిరావు. చదవటం పూర్తిఅయిన తరవాత ఇష్టాగొష్టి చర్చకు తగిన కాలము కేటాయించుకోవలె.
అచ్చుపుస్తకాలకంటే, నటీనటులకు ఈ ప్రధమ సమావేశానికి తగినంత ముందుగా ఒక్కొక్క నాటకప్రతి ఇచ్చి, నాటకాన్ని వారు చదువుకొని, లక్షణ నిరూపణ చేసుకొని, చర్చకు అవసరమైన అంశాలను గుర్తించుకొని